
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. పాముకాటుతో చిన్నారి, దుబాయిలో యాకర్‌పల్లి వాసి అనారోగ్యంతో, విద్యుత్ షాక్‌తో వృద్ధురాలు, తాటి చెట్టు పైనుంచి జారిపడి ఒకరు మృతిచెందారు.
పాముకాటుతో చిన్నారి
లక్సెట్టిపేట: పాము కాటుకు గురై చిన్నారి మృతిచెందిన ఘటన మండలంలోని వెంకట్రావుపేటలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకట్రావుపేటకు చెందిన వందన–సుధాకర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి సుధాకర్ హోటల్‌లో పని చేస్తుండగా, తల్లి వందన కూలీ పని చేస్తోంది. వీరి చిన్నకుమార్తె ఉదయశ్రీ(4) శనివారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఆమె కాలిపై పాము కాటేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
దుబాయిలో యాకర్‌పల్లి వాసి మృతి
సారంగపూర్: బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లిన యాకర్‌పల్లి వాసి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని యాకర్‌పల్లి గ్రా మానికి చెందిన నిర్మల రాజు (41) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయిలోని జెబ్లాలీ ఏరి యాలో గల వేడామ్స్ కంపెనీలో కూలీ పని చేసేందుకు వెళ్లాడు. గతనెల క్రితం అనారోగ్యానికి గురి కాగా తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఈనెల 7న మృతి చెందాడు. మృతుడికి భార్య రుక్మవ్వ, కుమారుడు అఖిల్(16), కుమార్తె శృతి(9)లు ఉన్నారు. ప్రభుత్వం ఆయన మృతదేహాన్ని త్వరగా రప్పించేలా ఏర్పాట్లు చేయాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు.
విద్యుత్‌షాక్‌తో వృద్ధురాలి
దండేపల్లి: మండలంలోని ముత్యంపేటకు చెందిన వృద్ధురాలు ముత్తె రాజవ్వ (70) శనివారం విద్యుత్‌షాక్‌తో మృతి చెందింది. ఎస్సై తహాసీనొద్దీన్ కథ నం ప్రకారం.. రాజవ్వ ఇంటి వెనకాల గల పెరటిలో కూరగాయల తోటలోకి కోతులు రావడంతో వాటిని కొట్టేందు కు వెళ్లింది. ఇంట్లోకి తిరిగి వచ్చేక్రమంలో ఇంటి ముందు ఉన్న కూలర్ వైరు తెగిపడి ఉంది. గమనించకుండా వస్తుండగా వైరు ఆమె కాలికి తగిలింది. వైర్‌కు విద్యుత్ సరఫరా అయి షాక్‌తో కిందపడిపోయింది. గమనించిన భర్త రా యలింగయ్య, చుట్టుపక్కల వారిని పిలిచి కరెంట్ ఆఫ్ చేసి చూసేసరికి చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి
కోటపల్లి: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతిచెందిన ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై రాజేందర్ తెలిపిన వి వరాలు.. వేమనపల్లి మండలం దస్నాపూర్‌కు చెందిన తాళ్లపల్లి రాకేశ్ (30) శుక్రవారం సాయంత్రం కోటపల్లిలో కల్లు గీసేందుకు తాటి చెట్టెక్కాడు. ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలైన అతన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల నుంచి కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి చిన్నతనంలో మరణించగా కుటుంబాన్ని రాకేశ్ పోషిస్తున్నాడు. తల్లి పద్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.