
కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి ?
● విద్యుత్ షాక్ పెట్టి చంపేసి.. ● వాగులో పడేసి పోలీసులకు ఫిర్యాదు ● ఆస్తి వివాదమే కారణమని ప్రచారం
సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామానికి చెందిన చౌదరి జయేందర్(19)ను భూ పంపిణీ వివాదంలో కన్న తండ్రే కడతేర్చాడనే ప్రచారం జరుగుతోంది. గతకొంత కొంతకాలంగా భూమి, ఆస్తులపై వివాదం ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కుమారుడు జయేందర్ తిరిగి రాలేదని తండ్రి చౌదరి చిరంజీవి సిర్పూర్(టి) పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈనెల 10న పోలీసులు విచా రణ చేపట్టగా యువకుడి ఆచూకీ లభించలేదు. శని వారం ఉదయం హనుమాన్ జయంతికి టోంకిని హనుమాన్ ఆలయానికి వచ్చిన భక్తులు పెన్‌గంగ నదిలో స్నానానికి వెళ్లగా మృతదేహం కనిపించింది. సిర్పూర్(టి) ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి జ యేందర్ తల్లిదండ్రులను పి లిచి విచారించగా తమ కుమారుడే అని గుర్తించారు. కాగా, ఈ నెల 10న టోంకిని స మీ పంలోని తమ స్వంత పొలంలో అడవి పందులు రాకుండా విద్యుత్తు వైర్లు అమర్చగా ప్రమాదవశాత్తు తగిలి జయేందర్ మృతిచెందాడని, తమపై కేసులు నమోదు అవుతాయనే భయంతో సమీపంలో ఉన్న పెన్‌గంగలో మృతదేహాన్ని పడవేసి పోలీసుస్టేషన్‌లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారనీ ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల ఫోరెన్సిక్ వైద్య నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించామని, ఆదివారం పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.