
Pushpa Bangalore Press Meet: అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన సినిమా పుష్ప. డిసెంబర్17న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లతో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రెస్‌మీట్ చెప్పిన టైంకి కాకుండా ఆలస్యంగా ఎలా వచ్చారంటూ ఓ కన్నడ రిపోర్టర్ నిలదీశాడు.
11.15కి ప్రెస్‌మీట్ అనిచెప్పి1.15కి ఎలా వస్తారంటూ బన్నీ, రష్మికలపై ఓ రిపోర్టర్ ఫైర్ అయ్యాడు. దీంతో క్షమాపణలు చెప్పిన బన్నీ.. పొగమంచు కారణంగా ఫ్లైట్ కాస్త ఆలస్యం అయ్యిందని, అంతేకాకుండా ప్రెస్‌మీట్ టైమింగ్‌పై కాకుండా తనకు స్పష్టత లేదని చెప్పుకొచ్చాడు. సారీ చెబితే మనిషి పెరుగుతాడు కానీ తగ్గడు అంటూ తనదైన స్టైల్‌లో బన్నీ చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment