టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆయన పరువునష్టం పిటిషన్ వేశారు. ఈమేరకు సోమవారం విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానాన్ని నాగార్జున ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది.
నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున్ పిటీషన్‌పై మరోసారి విచారణ జరగనుంది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. అక్టోబర్ 8న నాగార్జున వాగ్మూలం రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్ట్‌కు నాగార్జున హాజరుకానున్నారు. ఇదే సమయంలో సాక్షుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: ఆ ఫోటోలన్నీ ఫేక్.. దర్శన్ కేసులో కీలక మలుపు
అయితే, నాగార్జున మీదే కేసులు వేస్తామని మంత్రి కొండా సురేఖ తరుపున వాదనలు వినిపిస్తున్న లాయర్ హెచ్చరించారు. అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్దాంతం చేస్తున్నాడు..? అని ఆయన ప్రశ్నించారు. నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో నాగార్జున అభిమానులు కూడా మండిపడుతున్నారు. బాధితుడి మీదే కేసులు వేస్తామని ఎలా వార్నింగ్‌లు ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment