అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి | Actor Pradeep K Vijayan Passed Away | Sakshi
Sakshi News home page

కమెడియన్‌ కన్నుమూత.. ఆ కారణం వల్లే..

Jun 13 2024 4:04 PM | Updated on Jun 13 2024 4:17 PM

Actor Pradeep K Vijayan Passed Away

చెన్నై: తమిళ నటుడు ప్రదీప్‌ విజయన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్‌ 12న) విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతడి స్నేహితుడు ఫోన్‌ చేస్తుండగా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు ప్రదీప్‌ ఇంటికి వెళ్లి చూడగా అతడు శవమై కనిపించాడు. గుండెపోటు వల్లే నటుడు మరణించాడని భావిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా ప్రదీప్‌.. తెగిడి అనే సినిమాతో పాపులర్‌ అయ్యారు. విలన్‌గా, కమెడియన్‌గా పలు సినిమాలు చేశారు. టెడ్డీ, ఇరుంబు తిరై, తమిళుకు ఎన్‌ ఒండ్రై అళతువం, లిఫ్ట్‌, మనం, కెన్నడీ క్లబ్‌, ఆడై.. ఇలా అనేక తమిళ చిత్రాల్లో నటించారు. చివరగా రాఘవ లారెన్స్‌ 'రుద్రన్‌' సినిమాలో కనిపించారు.

చదవండి: అది చూసే ప్రేమలో పడ్డా.. పెళ్లనగానే రిజెక్ట్‌.. ఎందుకంటే?: నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement