విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా? | Do You Know These Interesting Facts About Actor Vijay Sethupathi Daughter Sreeja, Deets Inside - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi Daughter Facts:‍ సేతుపతి కూతురు కూడా యాక్టరే.. ఆ సినిమాలో

Published Wed, Aug 30 2023 5:08 PM | Last Updated on Wed, Aug 30 2023 5:37 PM

Actor Vijay Sethupathi Daughter Sreeja Full Details - Sakshi

విజయ్ సేతుపతి ఓ నటుడు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు-వెబ్ సిరీస్‌లు ఫుల్ బిజీగా ఉన్నాడు. పేరుకే తమిళ యాక్టర్ గానీ దేశవ్యాప్తంగా బోలెడంత క్రేజ్ సంపాదించాడు. ఇంతలా పాపులారిటీ తెచ్చుకున్న సేతుపతికి పెళ్లయిందని, టీనేజ్ కూతురు ఉందని చాలామందికి తెలియదేమో. తాజాగా ఓ పిక్ బయటకు రావడంతో ఈ విషయం తెలుగు నెటిజన్స్ మధ్య చర్చకు దారితీసింది. ఇంతకీ విజయ్ సేతుపతి కూతురు డీటైల్స్ ఏంటి?

కెరీర్ ప్రారంభంలో విజయ్ సేతుపతి.. పలు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేశాడు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోకముందే అంటే 2003లోనే జెస్సీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అబ్బాయి సూర్య, అమ్మాయి శ్రీజ పుట్టారు. అయితే సేతుపతికి బోలెడంత స్టార్‌డమ్, దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. కానీ ఇతడి ఫ్యామిలీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదనే చెప్పొచ్చు. వాళ్ల ఫొటోలు కూడా పెద్దగా ఏం బయటకు రాలేదు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?)

అయితే విజయ్ సేతుపతి కొడుకు సూర్య.. తన 'నేను రౌడీనే' సినిమాలో చైల్డ్ క్యారెక్టర్‌లో నటించాడు. ఇక కూతురు శ్రీజ కూడా.. 2020లో విజయ్ సేతుపతి నటించిన 'ముగిల్' మూవీలో నటించింది. రీల్ లైఫ్ లోనూ వీళ్లిద్దరూ తండ్రి కూతురిగా నటించి ఆకట్టుకున్నారు. అయితే తాజాగా విజయ్ సేతుపతి.. తన కొడుకు-కూతురితో ఉన్న పిక్ బయటకు రావడంతో అందరూ షాకవుతున్నారు. ఇంత పెద్ద అమ్మాయి ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. 

ఇప్పటికే శ్రీజ సేతుపతి ఓ సినిమాలో నటించింది. ప్రస్తుతం చూస్తుంటే.. తండ్రి అంతా ఎత్తు కూడా పెరిగిపోయింది. అన్ని కలిసొస్తే.. త్వరలో నటి లేదా హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినాసరే ఆశ్చర్యపోనక్కర్లేదు. 

(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement