Actress Lirisha About Remuneration Problems - Sakshi
Sakshi News home page

Actress Lirisha: పెద్ద హీరో సినిమాకు అదే రెమ్యునరేషన్‌ కష్టాలు, ఇలాంటివి చేయకూడదనుకున్నా

Nov 13 2022 6:30 PM | Updated on Nov 13 2022 7:35 PM

Actress Lirisha About Remuneration Problems - Sakshi

సినిమా కోసం 40 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. ఫైనల్‌ కట్‌లో అక్కడక్కడ మాత్రమే కనిపించాను. అయితే వరుడు సినిమాకు నాకు సగం పేమెంట్‌ మాత్రమే ఇచ్చారు

సినిమా హిట్టయినా కాకపోయినా అందులో నటించిన నటీనటులకు ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పాల్సిందే! కానీ కొందరు నిర్మాతలు అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తామంటూ మాట దాటవేస్తుంటారు. ఈ క్రమంలో ఇబ్బందులుపడ్డ నటీనటులెంతమందో! అందులో నటి లిరిష కూడా ఒకరు. గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె వకీల్‌ సాబ్‌లో లేడీ పోలీసాఫీసర్‌గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. సినిమాలే కాకుండా సీరియల్స్‌.. అందులోనూ నెగెటివ్‌ పాత్రల్లోనే ఎక్కువగా నటించింది లిరీష. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో రెమ్యునరేషన్‌ ఇబ్బందులను చెప్పుకొచ్చింది.

'రెమ్యునరేషన్‌ విషయంలో చాలాసార్లు ఇబ్బందులు పడ్డాను. తప్ప సముద్రం అని ఓ సినిమా చేశాను. ఇంతవరకు నా పారితోషికం ఇవ్వనేలేదు. నిర్మాతకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా పట్టించుకోవడం లేదు. అడ్వాన్స్‌ ఒక్కటే ఇచ్చారు, బ్యాలెన్స్‌ అలాగే ఉండిపోయింది. ఈయన ఇంక నా డబ్బులిచ్చేలా లేడులే అని వదిలేసుకున్నా. సీరియల్స్‌, సినిమాల్లో చాలాసార్లు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. వరుడు సినిమా కోసం 40 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. ఫైనల్‌ కట్‌లో అక్కడక్కడ మాత్రమే కనిపించాను. అయితే వరుడు సినిమాకు నాకు సగం పేమెంట్‌ మాత్రమే ఇచ్చారు. మిగతా సగం ఇవ్వలేదు. ఇలాంటి సినిమాలు చేయకూడదని అప్పుడనిపించింది' అని చెప్పుకొచ్చింది లిరీష.

చదవండి: మా పేరెంట్స్‌ను వదిలి వచ్చేయమంది, ఫోన్‌ పగలగొట్టా: సూర్య
క్యాన్సర్‌తో ప్రముఖ దర్శకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement