
Actress Samantha Setting Deal For More 3 Movies: ఏదో రకంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్న నటి సమంత. మొన్నటి వరకు నాగచైతన్యతో విడాకుల వ్యవహారంతో హాట్ టాపిక్ మారిన సామ్.. ప‍్రస్తుతం సినిమా ఆఫర్స్‌లో 'తగ్గేదే లే' అంటోంది. మంగళవారం (నవంబర్ 30) 'పుష్ప' సినిమాలోని ఐటమ్ సాంగ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ వైరల్‌గా మారింది. ఏకంగా హాలీవుడ్‌లో నటించే ఆఫర్ సొంత చేసుకున‍్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫ‍్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌కు పరిచయమైన సమంత ప్రస్తుతం ముంబై బాట పట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఎలాంటి అధికార ప్రకటన ఇప్పటివరకు రాలేదు.
తాజాగా బాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర‍్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతతో చర‍్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పందం చేసుకునేందుకు సామ్‌కు ప్రపోజల్ పెట్టారట ఆ నిర్మాణ సంస్థవాళ‍్లు. దీనికోసం సమంతకు భారీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందానికి సామ్ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరుకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగులో శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది సామ్. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది చదవండి: మాస్ లుక్‌లో సమంత.. ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment