
వైజాగ్ జగదీశ్వరి.. మూడు వేలకు పైగా నాటకాలు, 76 సీరియల్స్, బోలెడన్ని సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. విలన్‌గా స్క్రీన్‌పై భయపెట్టించే ఆమె నిజజీవితంలో మాత్రం ఎంతో నెమ్మదిగా ఉంటుంది. అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి నుంచి ఛాన్సుల కోసం ఆఫీసులు తిరగాల్సి వస్తోంది అంటోంది నటి జగదీశ్వరి. ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లవుతుండగా ఇప్పటికీ పెద్దగా కూడబెట్టుకోలేదని, సంపాదించిన కొద్దిమొత్తం కూడా పోగొట్టుకున్నానంటోంది.
నా కొడుకుతో నా గురించి చీప్‌గా మాట్లాడారు
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను 30 ఏళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఆర్. నారాయణమూర్తి గారితో 6 సినిమాలు చేశాను. ఓసారి నా కొడుకు సినిమా అవకాశాల కోసం ఓ ఆఫీసుకు వెళ్లి అక్కడ నా ఫోటో చూపించాడు. అక్కడున్న వ్యక్తి.. ఓహ్, ఈవిడా.. అమ్మాయిలను వెంటేసుకుని తిరిగే ఈమె మీ అమ్మగారా? నాతో అన్నావు కానీ బయట ఎక్కడా ఆమె మీ అమ్మ అన్న విషయం చెప్పకు అని అన్నాడట. చాలా కాలం తర్వాత నా కొడుకు ఈ విషయం చెప్పాడు. ఎంతో బాధేసింది. కానీ నాకు వివాదాల జోలికి వెళ్లడం ఇష్టముండదు. వివాదాల్లో చిక్కుకుంటే తర్వాత నేను ఇండస్ట్రీలో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక అడుగు వెనక్కే వేస్తాను.
ఉన్నదంతా పోగొట్టుకున్నా..
ఓసారి మా ఇంట్లో దొంగలు పడి పాతిక లక్షల బంగారం పోయింది. మరోపక్క చిట్టీలు కట్టి దారుణంగా మోసపోయాను. మొత్తం రూ.90 లక్షల దాకా కోల్పోయాను. నేను తెచ్చుకుంది, ఇక్కడ సంపాదించి అంతా పోగొట్టుకున్నాను. ఒకప్పుడు నెలకు 20 రోజులకు పైగా పనిచేసేదాన్ని. ఇప్పుడు సరిగా పని దొరకడం లేదు. ఈ ఆరు నెలల్లో ఏవో కొన్ని సీరియల్స్, ఓ సినిమా చేశానంతే! ఆ సినిమాకు కూడా ఒకే ఒక రోజు పని చేశాను. కానీ ఇంతవరకు డబ్బులివ్వలేదు. ఒకానొక సమయంలో ఇంట్లో బియ్యం కూడా లేదు. సీరియల్స్ కూడా తక్కువ రోజులే చేశాను. దానికి కూడా సరిగా డబ్బులు ఇవ్వడం లేదు.
జల్సాల కోసం పెళ్లి చేసుకున్నాడు
వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగత విషయంలోనూ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నాకు 18 ఏళ్లున్నప్పుడు నా భర్త లారీ ప్రమాదంలో చనిపోయాడు. అప్పటికి నాకు ఓ చిన్న బాబున్నాడు. పాప కడుపులో ఉంది. నా నటనను మెచ్చి ఓ లాయర్ నన్ను ఇష్టపడ్డాడు. 25 ఏళ్లకు అతడిని రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ అతడు జల్సాలు చేయడానికి నన్ను పెళ్లాడాడు. నువ్వు నేను సినిమా నేను చేయాల్సింది. మా ఆయన వల్లే ఆ అవకాశం చేజారింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత తెలంగాణ శకుంతల 400 సినిమాలు చేశారు, అంత బిజీ అయింది. నా భర్త నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నేను ఆత్మహత్యాయత్నం చేశాను. ఇప్పటికీ చేతి మీద ఆ గుర్తులు ఉన్నాయి అంటూ కంటతడి పెట్టుకుంది వైజాగ్ జగదీశ్వరి.
చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా
పుష్ప 2లో ఐటం సాంగ్, ఊర్వశి రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
Comments
Please login to add a commentAdd a comment