
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని అటు ఫిల్మీదునియాలో ఇటు సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. అబ్బే, అదేం లేదంటూనే వీరిద్దరు పార్టీలకు, షికార్లకు వెళ్తూ ఉంటారు. వీళ్లు జంటగా కనిపించిన ప్రతిసారి అభిమానులు మాత్రం భలే ఉన్నారిద్దరూ అని ముచ్చటపడిపోతుంటారు.
తాజాగా సిద్దార్థ్, అదితి ముంబైలో జూబ్లీ వెబ్ సిరీస్ ప్రీమియర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ జంటగా కెమెరాకు పోజులిచ్చారు. అక్కడున్న వాళ్లు ఈ జంటను చూసి లవ్‌లీ జోడి అని కామెంట్ చేయగా అదితి సిగ్గుపడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సిద్, అదితి ఎంత ముద్దొస్తున్నారో.. అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇప్పటికైనా ఇది ప్రేమంటారా? కాదంటారా? అని ప్రశ్నిస్తున్నారు.
కాగా గతంలో అదితి రావుకు సిద్దార్థ్‌తో డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ అందరితో పంచుకునే విషయం ఏదైనా ఉంటే నేనే చెప్తానంటూ మాట దాటవేసింది. అయినా నేనేం చెప్పినా చివరకు మీకు నచ్చినట్లుగానే ఊహించుకుంటారుగా అని కౌంటర్ వేసింది. కాగా వీరిద్దరూ మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచే ఈ లవ్ మొదలైందని టాక్!
Comments
Please login to add a commentAdd a comment