
అల్లు అర్జున్, రష్మిక
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో ‘పుష్ప: ది రూల్’ సినిమా షూటింగ్ సందడి నెలకొంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్’. 2021లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప: ది రైజ్’ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ యాగంటి క్షేత్రంలో జరుగుతోంది. యాగంటి క్షేత్రంలోని గుహలో కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామికి హీరోయిన్ రష్మిక మందన్నా బంగారు కిరీటాన్ని బహూకరించే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. నేడు కూడా ఈ క్షేత్రంలోనే షూటింగ్ జరుగుతుంది. ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌తో ఆప్రాంతమంతా ప్రజలతో సందడిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment