
కోలీవుడ్‌లో విజయ్ పేరు వింటేనే బాక్సాఫీస్ మారు మోగుతుంది. బయ్యర్ల గల్లాపెట్టెలు కళకళలాడతాయి. అందుకే ఈయన చిత్రాలు జయాపజయాలకు అతీతం అంటారు ట్రేడ్ వర్గాలు. ఆయన నటించిన లియో చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా బయ్యర్లను మాత్రం ఖుషీ చేసింది. ప్రస్తుతం విజయ్ 'ది గోట్' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇది విజయ్ నటిస్తున్న 68వ చిత్రం. నటి మీనాక్షి చౌదరి నాయకిగా నటిస్తున్న ఇందులో స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్ ,ప్రేమ్‌జీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

విజయకాంత్‌ను ఇందులో కీలక పాత్రలో గ్రాఫిక్స్‌లో చూపించబోతున్నట్లు సమాచారం. నటి త్రిష, శివకార్తికేయన్ కూడా అతిథిపాత్రలో మెరవబోతున్నట్లు టాక్ వైరల్ అవుతుంది. లేకపోతే విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న గోట్ చిత్రం షూటింగును పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి విజయ్ డబ్బింగ్ కూడా 50 శాతం పూర్తి చేసినట్లు తాజా సమాచారం. లేకుంటే ఈ చిత్రం తర్వాత విజయ్ హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది విజయ్ నటించిన 69వ చిత్రం మాత్రమే కాకుండా ఇదే చివరి చిత్రం అనే ప్రచారం హోరెత్తుతోంది.
కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కథానాయకిగా నటించేది ఎవరన్న విషయమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇందులో కీర్తిసురేష్, సమంత నటిస్తారని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. పూజాహెగ్డే నటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో హీరోయిన్ పేరు కూడా తెరపైకి వచ్చింది ఆమెనే నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ అపర్ణ బాలమురళి. అయితే వీరిలో ఎవరికి విజయ్ సరసన నటించే అదృష్టం లభిస్తుందన్నది త్వరలోనే తేలిపోతుంది. ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ మాస్ ఎలిమెంట్స్ జోడించి పొలిటికల్ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు సమాచారం.