
బోల్డ్ బ్యూటీ అషూరెడ్డి గురించి బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడిన అషూ బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. షో నుంచి బయటకు వచ్చాక ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.
ఇక సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ షో చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది ఆ బ్యూటీ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లతో ముచ్చటించిన అషూ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
ఇందులో భాగంగా ఓ నెటిజన్.. ఈ మధ్య నీకు ఓవరాక్షన్ బాగా ఎక్కువైనట్లు అనిపించడం లేదా అంటూ అడగ్గా.. అవును కానీ ఈ మధ్యే కాస్త తగ్గింది అంటూ కౌంటర్ ఇచ్చిన అషూ చెప్పు ఉన్న ఎమోజీని షేర్ చేసింది. దీంతో అషూ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment