బిగ్‌బాస్‌ హౌస్‌లోకి భార్యాభర్తలు.. ఆమెకే ఎక్కువ రెమ్యునరేషన్‌ | Bigg Boss 17 Hindhi: Highest Remuneration for Ankita Lokhande - Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సీరియల్‌ నటి.. అత్యధిక పారితోషికం ఆమెకే..

Published Mon, Oct 16 2023 3:50 PM | Last Updated on Mon, Oct 16 2023 4:02 PM

Bigg Boss 17: Highest Remuneration for Ankita Lokhande - Sakshi

బిగ్‌బాస్‌ షో.. ఈ రియాలిటీ షోలోకి ఒక్కసారైనా వెళ్లిరావాలనుకునేవారు కొందరైతే.. మాకొద్దురా బాబూ అని తూర్పు తిరిగి దండం పెట్టేసేవాళ్లు మరికొందరు. అటు ప్రేక్షకుల్లోనూ బిగ్‌బాస్‌ను ఆరాధించేవాళ్లున్నారు, తిట్టిపోసేవాళ్లూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే తిడుతూనే బిగ్‌బాస్‌ షోను చూసే జనాల సంఖ్యా ఎక్కువే! బిగ్‌బాస్‌కు వస్తున్న ఆదరణను బట్టే అన్ని చోట్లా ప్రతి ఏడాది కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఏడో సీజన్‌ నడుస్తుండగా తాజాగా హిందీలోనూ కొత్త సీజన్‌ షురూ అయింది.

అక్టోబర్‌ 15న హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌ ప్రారంభమైంది. ఈ షోలోకి 17 మంది సెలబ్రిటీలు అడుగుపెట్టారు. అందులో హీరోయిన్‌ మన్నారా చోప్రా, కమెడియన్‌ మునావర్‌ ఫరూఖి, క్రిమినల్‌ లాయర్‌ సనా రేస్‌ ఖాన్‌తో పాటు రెండు జంటలు కూడా ఉన్నాయి. నీల్‌ భట్‌-ఐశ్వర్య శర్మ, అంకితా లోఖండే-విక్కీ జైన్‌ దంపతులున్నారు. ఈ సీజన్‌లో అందరి కళ్లు అంకిత- విక్కీ దంపతుల మీదే ఉంది. ఈ రియాలిటీ షో కోసం అంకితా లోఖండే భారీ ఎత్తున షాపింగ్‌ కూడా చేసింది.

ఇకపోతే ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్నవారిలో అంకిత లోఖండే మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కుగానూ ఆమె వారానికి రూ.10-12 లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు భోగట్టా! ఆమె భర్త విక్కీ జైన్‌ మాత్రం వారానికి ఐదు లక్షలతో సరిపెట్టుకుంటున్నాడట! ఏమైనా అంకితా లోఖండే బుల్లితెరమీదే కాదు బిగ్‌బాస్‌ షోలోనూ తన డామినేషన్‌ చూపిస్తోంది!

చదవండి: సిద్దార్థ్‌ చిన్నా మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement