బిగ్‌బాస్ షో.. ఎన్ని సీజన్లు వచ్చినా జనాలు ఆదరిస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఈ రియాలిటీ షో సైతం కొత్తగా ముస్తాబవుతూనే ఉంటుంది. తెలుగులో ఇంకా ఏడో సీజనే నడుస్తోంది కానీ హిందీలో ఏకంగా 16 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నెల 15న బిగ్‌బాస్ 17వ సీజన్ షురూ కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తవగా ఈసారి కూడా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.
రెమ్యునరేషన్ ఎంతంటే?
మరి ఈసారి షో కోసం సల్మాన్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా? ఒక్క ఎపిసోడ్‌కు రూ.6 కోట్ల మేర పుచ్చుకుంటున్నాడట. వారానికి రెండు ఎపిసోడ్లు(శని, ఆది)లో కనిపించే సల్లూ భాయ్ ఒక్క వారానికే రూ.12 కోట్ల దాకా వెనకేసుకుంటున్నాడన్నమాట! కాగా బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన కొత్తలో అంటే 2010వ సంవత్సరంలో సల్మాన్ వారానికిగానూ రూ.2.5 కోట్లు తీసుకునేవాడు. ఆ తర్వాతి సీజన్‌కు కూడా ఇంచుమించు అంతే తీసుకున్నాడు. బిగ్‌బాస్ ఏడో సీజన్ వచ్చేసరికి ఈ రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేశాడు.
ప్రతి సీజన్‌కూ పెంచుకుంటూ పోతున్న సల్మాన్
ఎనిమిదవ సీజన్లో రూ.5.5 కోట్లు, తొమ్మిదో సీజన్లో రూ. 7 కోట్లు, 10వ సీజన్లో రూ.8 కోట్లు తీసుకున్నాడు. 11వ సీజన్ నుంచి దాన్ని మరింత పెంచుకుంటూ పోయాడు. ఇప్పుడు 17వ సీజన్‌కు వచ్చేసరికి ఏకంగా వారానికి రూ.12 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే సీజన్ మొత్తానికి గానూ రూ.150 కోట్ల పైచిలుకు తీసుకోనున్నట్లు కనిపిస్తోంది.
చదవండి: హీరోతో యాడ్.. రాత్రికి వస్తేనే ఛాన్స్.. నటికి చేదు అనుభవం
Comments
Please login to add a commentAdd a comment