
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అందరూ చర్చించుకున్న టాపిక్ ఏదైనా ఉందా అంటే అది అఖిల్-మోనాల్-అభిజిత్ ట్రయాంగిల్ స్టోరీనే. మొదట్లో అఖిల్, అభి ఇద్దరూ మోనాల్‌ను మెప్పించేందుకు పోటాపోటీగా ముందుకు వచ్చేవారు. మోనాల్ తనతో కాకుండా వేరే ఎవరితో ఉన్నా అఖిల్ తట్టుకోలేకపోయేవాడు. ఎప్పుడూ తన చెంతనే ఉండాలని ఆరాటపడేవాడు. అభి కూడా మోనాల్ గురించి తెలుసుకోవాలని తెగ తాపత్రయపడేవాడు. ఆమె వ్యక్తిగత విషయాల గురించి గుచ్చిగుచ్చి అడిగేవాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎన్నో మలుపులు తిరిగింది. మోనాల్ ఒక మాట మీద ఉండదు అని తెలిసిన క్షణం నుంచి అభి ఆమెకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. మోనాల్ మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా విడిగా ఉంటేనే ఏ గొడవ ఉండదని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పాడు. ఇక ఉన్న ఒక్క దిక్కు అఖిల్. కానీ మోనాల్ వల్లే తనకు సోహైల్‌కు బేధాభిప్రాయాలు వచ్చాయని తెలుసుకున్న అఖిల్ ఆమెతో మాట్లాడటమే మానేశాడు. (చదవండి: అఖిల్, నన్ను బే అనకు: సోహైల్ వార్నింగ్)
అక్కడితో ఆగకుండా నీకు క్లారిటీ అనేది లేదంటూ ఏకంగా నామినేట్ చేసి ఊహించని షాకిచ్చాడు. మోనాల్ గురించి నిజాలు తెలియడంతోనే అభి లాగే అఖిల్ కూడా ఆమెను దూరం పెట్టి గేమ్‌పై ఫోకస్ పెడుతున్నాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ మోనాల్ అభిమానులు మాత్రం అఖిల్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతగానో నమ్మిన మోనాల్‌ను నామినేట్ చేసి వెన్నుపోటు పొడిచాడని విమర్శిస్తున్నారు. దీనివల్ల ఏకాకిగా మారిన మోనాల్ సెల్ఫిష్ మాస్టర్ ఉచ్చులో పడే అవకాశముందని భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం స్నేహానికి లొంగిపోకుండా అఖిల్ కరెక్ట్ గేమ్ ఆడుతున్నాడని మెచ్చుకుంటున్నారు. జరిగిందేదో జరిగిపోయింది, ఈ ఇద్దరూ వీలైనంత త్వరగా కలిసిపోవాలని మరికొందరు కోరుకుంటున్నారు. (చదవండి: సోనూ సూద్, ప్లీజ్ మోనాల్‌ను కాపాడండి)
Comments
Please login to add a commentAdd a comment