బిగ్‌బాస్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేవాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుందని వ్యాఖ్యాత నాగార్జున ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ప్రయోజనం విషయాన్ని పక్కనపెడితే వారికి కష్టనష్టాలే ఎక్కువగా ఉంటాయి. అప్పటికే అందరితో ఓ బంధాన్ని ఏర్పరుచుకుని జంటలుగా మారిన కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను అంత తొందరగా స్వీకరించలేరు. పైగా మీ కన్నా ముందు నుంచే హౌస్‌లో ఉన్నామని ఆజమాయిషీ చూపిస్తారు. నామినేషన్‌లోనూ ఇంకో ఆప్షన్ వెతుక్కోనవసరం లేకుండా నేరుగా వారిని నామినేట్ చేసేస్తుంటారు. బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో ముమ్మాటికీ ఇదే జరుగుతోంది. (చదవండి: బిగ్‌బాస్: అనుష్క అందుకే రాలేదట)
సింపథీ ఓట్లతో నెగ్గుకువస్తున్న కుమార్ సాయి
మొదటి వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయిని అందరితో కలవలేకపోతున్నాడంటూ నామినేట్ చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ సింపథీ ఓట్లతో అతడు ఎలాగోలా నెగ్గుకు వస్తున్నాడు. ఇక మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన స్వాతి దీక్షిత్ అందరితో కలవట్లేదన్న కారణంతో అమ్మ రాజశేఖర్ ఆమెను నామినేట్ చేశారు. దీంతో హౌస్‌లో అడుగు పెట్టిన మూడు రోజులకే ఆమె నామినేషన్ గండంలో చిక్కుకుంది. కానీ ఎలిమినేషన్ నుంచి బయటపడటం అంత సులువేమీ కాదు. ఈ గండం గట్టెక్కాలంటే ఆమె ముందు ఉన్నది ఒకటే దారి. ఈ వారంలో తనేంటో నిరూపించుకోవాలి. టాస్కులు ఆడాలి, ఎంటర్‌టైన్ చేయాలి, ఎలాగోలా ప్రేక్షకులు ఓట్లను తన వైపు తిప్పుకోవాలి. కానీ అక్కడ స్వాతి అలాంటి ప్రయత్నాలేమీ చేస్తున్నట్లు కనిపించడం లేదు. (చదవండి: బిగ్‌బాస్: ఈ వారం నామినేషన్‌లో ఏడుగురు)
అభి కోసం ఆట త్యాగం
లాస్య చెప్పినట్టుగానే ఎక్కువగా అభిజిత్‌తో ఉంటోంది. దీంతో అభి, హారిక మధ్య కూడా ఎడం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక నిన్న బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులోనూ స్వాతి సొంతంగా ఆడకుండా అభితో జట్టు కట్టింది. తాను సేకరించిన నాణాలను కూడా అతడికే ఇస్తానంది. ఈ నిర్ణయం ఆమె అభిమానులకు కూడా నచ్చడం లేదు. అతడితో కబుర్లు చెప్పడం వరకు ఓకే కానీ అతడి కోసం ఆట త్యాగం చేయడం అక్కర్లేదని హెచ్చరిస్తున్నారు. అటు బిగ్‌బాస్ సైతం జంటలుగా ఆడద్దని ఇంటిసభ్యులను హెచ్చరించారు. మరి నేటి ఎపిసోడ్ నుంచైనా స్వాతి తనకు తానుగా గేమ్ ఆడితే బెటర్ అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: స్వాతి దీక్షిత్ గురించి లాస్య చెప్పింది నిజమేనా?)
Comments
Please login to add a commentAdd a comment