Bigg Boss 6 Telugu Grand Launch Promo Out - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: ప్రోమో వచ్చేసింది.. ఈ కంటెస్టెంట్స్‌ని గుర్తు పట్టారా?

Sep 4 2022 3:02 PM | Updated on Sep 4 2022 3:18 PM

Bigg Boss 6 Telugu Grand Launch Promo Out - Sakshi

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి మొదలైంది. మరి కొద్ది గంటల్లో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ప్రారంభం కానుంది. కొత్త కంటెస్టెంట్స్‌, కొత్త టాస్క్‌లతో బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున వచ్చేస్తున్నాడు. తాజాగా బిగ్‌బాస్‌6కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్‌. అందులో ఆరో సీజన్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్‌ని చూపించి చూపించనట్టుగా చూపించి ఆసక్తి రేకెత్తించారు. వాళ్ల ముఖాలను సరిగా చూపించలేదు కానా..వాయిస్‌ని బట్టి కొంతమందిని గుర్తించొచ్చు.

ముఖ్యంగా చలాకీ చంటి, సింగర్‌ రేవంత్‌ వాయిస్‌లు స్పష్టంగా వినిపించాయి. అలాగే హౌస్‌లోకి వెళ్తున్న జోడీని కూడా చూపించారు. ఇక ఈసారి కూడా హుస్‌లో అమ్మాయిల హవా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హోస్ట్‌ సాగార్జున వారిని ఓ ఆట ఆడేసుకున్నాడు.  
(చదవండి: బిగ్‌బాస్‌-6  ఫైనల్‌ కంటెస్టెంట్లు వీళ్లే.. నో ఛేంజ్‌)

ఓ కంటెస్టెంట్‌.. మిమ్మల్ని మాస్టారూ అని పిలవొచ్చా అని అడగడంతో.. ‘మా..కి, స్టార్‌..కి మధ్య గ్యాప్‌ ఇచ్చి మా.. స్టార్‌ అని పిలువు అని నాగ్‌ అనడం అందరిని ఆట్టుకుటుంది. మెత్తానికి బిగ్‌బాస్‌ షో అయితే అదిరింది. గత సీజన్స్‌తో పోలిసే ఈ సారి జోష్‌  ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement