బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది.. కానీ చివరికి నన్ను తీసేశారు: అనిల్‌ | Bigg Boss 7 Telugu: Anil Geela About BB Offer - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: 99% పక్కా అన్నారు, ఏమైందో మరి.. చివరికి నన్ను తీసేశారు.. మై విలేజ్‌ షో అనిల్‌

Published Thu, Aug 31 2023 7:40 AM | Last Updated on Sat, Sep 2 2023 1:58 PM

Bigg Boss 7 Telugu: Anil Geela About BB Offer - Sakshi

బిగ్‌బాస్‌ 7.. అంతా ఉల్టా పల్టా.. అని నాగార్జున చెప్తూనే ఉన్నాడు. చివరికి అదే నిజమయ్యేలా ఉంది. అబ్బాస్‌, ప్రియాంక జైన్‌, మొగలిరేకులు హీరో సాగర్‌.. ఇలా కాస్త జనాల్లో క్రేజ్‌ ఉన్న సెలబ్రిటీలు వస్తున్నారంటూ గతకొంతకాలంగా ప్రచారం జరిగింది. కట్‌ చేస్తే వీళ్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేశారట! అటు మై విలేజ్‌ షో అనిల్‌కు కూడా బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చినట్లే వచ్చి చేజారిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

డబ్బులు సంపాదించొచ్చు
ఈ క్రమంలో అనిల్‌ బిగ్‌బాస్‌ షోలో తన ఎంట్రీపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాకు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. మా టీమ్‌ మెంబర్స్‌ అంతా కూడా వెళ్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అవకాశాలు ఊరికే రావు, ఎందుకు వృథా చేసుకోవడం అని చెప్పారు. అటు అమ్మ కూడా.. పిచ్చిపిచ్చి నాటకాలు చేయకుండా బిగ్‌బాస్‌కు వెళ్లి కొన్ని డబ్బులు సంపాదించు, మంచిగా సెట్‌ కావచ్చు అంది. నన్ను ఫాలో అయ్యేవారు కూడా సోషల్‌ మీడియాలో నాకు మెసేజ్‌లు చేస్తూనే ఉన్నారు. ఎలాంటి స్ట్రాటజీలు లేకుండా నీలా నువ్వు ఉండు, టాప్‌ 3 నుంచి విన్నర్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని మెసేజ్‌లు పంపిస్తున్నారు. నేను కూడా బిగ్‌బాస్‌ నుంచి ఫోన్‌ వచ్చినప్పుడు ఎగ్జయిట్‌ అయ్యాను.

బిగ్‌బాస్‌? సినిమా?
కాకపోతే నేను ఓ కథ రాసుకున్నాను. నిర్మాత కుదిరితే సినిమా చేద్దామని ఆలోచించాను. ఇంతలో బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. అటు బిగ్‌బాస్‌కు వెళ్లాలా? ఇటు సినిమా తీద్దామా? అన్న డైలామాలో ఉండిపోయాను. బిగ్‌బాస్‌కు వెళ్లాక నన్ను నటుడిగా అంగీకరిస్తారా? అన్న డౌట్‌ కూడా ఉంది. మరోవైపు బిగ్‌బాస్‌ టీమ్‌తో చర్చలు కూడా అయ్యాయి. ఇంతలో ఏమైందో ఏమో కానీ నన్ను రిజెక్ట్‌ చేశారు. ఎందుకు క్యాన్సిల్‌ చేశారన్నది నాకు కూడా తెలియట్లేదు. 99.99% కన్ఫామ్‌ అన్నాక చివరి నిమిషంలో ఎందుకు తీసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. నేను బిగ్‌బాస్‌ 7లో పాల్గొనడం లేదు. బిగ్‌బాస్‌ ఆఫర్‌ పోయింది కాబట్టి ఇప్పుడు నా పూర్తి ఫోకస్‌ సినిమాపైనే పెడుతున్నాను' అని అనిల్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: భర్త పక్కన నటించేందుకు నో చెప్పిన హీరోయిన్‌.. ఆ స్థానంలో సాయిపల్లవి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement