విష్ణుప్రియకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ.. ఎంత పనిచేశావ్ యష్మి | Bigg Boss 8 Telugu October 22nd Full Episode Review And Highlights: Heated Arguments Between Contestants In Nominations | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 51 Highlights: ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?

Published Wed, Oct 23 2024 8:13 AM | Last Updated on Wed, Oct 23 2024 10:28 AM

Bigg Boss 8 Telugu Day 51 Episode Highlights

వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత నామినేషన్స్ రెండు రోజుల పాటు జరుగుతోంది. ఈ వారం కూడా వాడీవేడిగా సాగింది. నబీల్ వంతు పూర్తవడంతో సోమవారం నామినేషన్ ప్రక్రియ ఆగింది. ఇన్నాళ్లు విష్ణుప్రియ-పృథ్వీ మధ్య లవ్ ట్రాక్‪‌ ఏదో అలా కనిపించింది. మంగళవారం ఎపిసోడ్‌తో అది కాస్త బ్రేకప్ అయింది. ఇంతకీ ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? విష్ణు బ్రేకప్ సంగతేంటి? అనేది మంగళవారం ఎపిసోడ్ (51వ రోజు) హైలైట్స్‌లో చూద్దాం.

ముందుగా తేజ మొదలుపెట్టాడు. నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తోందని గంగవ్వని అని విష్ణుప్రియ అనడం నచ్చలేదని చెప్పి ఆమెని నామినేట్ చేశాడు. ప్రతిసారి రివేంజ్ అనడం అస్సలు నచ్చలేదని చెప్పి పృథ్వీ పేరు చెప్పాడు. దీంతో పృథ్వీ-రోహిణి మరోసారి గొడవపడ్డారు. తర్వాత వచ్చిన మెహబూబ్.. హరితేజ సరిగా ఆడట్లేదని, ఫైర్ కాస్త ఫ్లవర్ అయిందని అన్నాడు. బ్యాటరీ టాస్క్‌లో నయని సరిగా ఆడలేదని నామినేట్ చేశాడు.

తర్వాత వచ్చిన ప్రేరణ.. విష్ణుప్రియని నామినేట్ చేసింది. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని కారణం చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం నడించింది. విష్ణుప్రియ ఓ ఫేక్ ఫ్రెండ్ అని ముద్ర వేసేసింది. పృథ్వీని నేను నామినేట్ చేయడం నీకు నచ్చలేదు అంతే కదా అని ప్రేరణ అనేసరికి... అవును, ఆ నిర్ణయం నాకు నచ్చలేదు అని విష్ణు వాదించింది. మధ్యలో నబీల్ టాపిక్ వచ్చింది. ఓసారి నబీల్ చెంప పగలగొడతా అన్నావ్ కదా ప్రేరణ అని విష్ణుప్రియ అనేసరికి.. అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు అని ప్రేరణ వాదించింది.

(ఇదీ చదవండి: ఖైరతాబాద్‌లో రామ్ చరణ్ సందడి.. కొత్త కారు నంబర్‌ ఎంతంటే?)

నీ గేమ్ మొత్తం పృథ్వీ వైపే ఉంది, అతడే నీ గేమ్ అని ప్రేరణ వాదించేసరికి.. అవును అయితే ఏంటి, నువ్వు పెడిక్యూర్, మేనిక్యూర్, హెయిర్ స్టైల్ తప్ప హౌస్‌లో ఏం చేస్తున్నావ్ అని ప్రేరణ గురించి విష్ణు కామెంట్ చేసింది. తర్వాత ప్రేరణ.. పృథ్వీ పేరు చెప్పింది. నువ్వు రివేంజ్ నామినేషన్ వేస్తావ్, బయటికెళ్లడానికి చాలా అర్హత ఉంది నీకు అని కుండ బద్దలు కొట్టేసింది. రెండు వారాల ఇమ్యూనిటీ ఇస్తానన్నా సరే గడ్డం తీయలేదు. మరెవరైనా అయితే చేసేవాళ్లు అని కారణాలు చెప్పింది. దీంతో రెచ్చిపోయిన పృథ్వీ.. ఓటింగ్ ప్రకారం ఉంటా, గేమ్‌పై నమ్మకముంది. నువ్వు టాస్క్ ఇవ్వండి అని అడుక్కుంటూ కూర్చో అని పృథ్వీ అన్నాడు.

తర్వాత వచ్చిన గంగవ్వ.. నిఖిల్, విష్ణుప్రియని నామినేట్ చేసింది. అనంతరం నిఖిల్ వచ్చి.. మెహబూబ్, నయనిని నామినేట్ చేశాడు. యష్మి వంతు వచ్చేసరికి.. విష్ణుప్రియ, మెహబూబ్‌ని నామినేట్ చేసింది. అవినాష్.. గతవారం గొడవని బయటకు తీసి పృథ్వీని నామినేట్ చేశాడు. తర్వాత నిఖిల్‌ని కూడా నామినేట్ చేశాడు. అలా ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి.

నామినేషన్స్‌లో నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, హరితేజ, నయని పావని ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. షీల్డ్ ఉన్నప్పటికీ హరితేజని ఇద్దరు సభ్యులు నామినేట్ చేసిన కారణంగా ప్రైజ్‌మనీ నుంచి లక్ష రూపాయలు తగ్గిపోయాయి. ఇక వీళ్లలో ఒకరిని కాపాడొచ్చు అని బిగ్‌బాస్ చెప్పేసరికి మెగా చీఫ్ గౌతమ్.. హరితేజని సేవ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, నయని నామినేషన్స్‌లో నిలిచారు.

ఇదంతా అయిపోయిన తర్వాత అర్థరాత్రి పృథ్వీ-యష్మీృ-ప్రేరణ చాలాసేపు డిస్కషన్ పెట్టారు. విష్ణుప్రియతో రిలేషన్ ఉందా? లేదా అనే టాపిక్‌పై చాలాసేపు మాట్లాడుకున్నారు. విష్ణుప్రియపై ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని యష్మి అడిగేసరికి లేదు జస్ట్ ఫ్రెండ్ అని పృథ్వీ చెప్పాడు. దీని తర్వాత విష్ణు-పృథ్వీ కూడా కాసేపు మాట్లాడుకుని తమ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదన్నట్లుగా బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: Happy Birthday Prabhas: అజాతశత్రువు.. అందరికి ‘డార్లింగ్‌’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement