
బిగ్‌బాస్ షో బోర్ కొట్టకుండా ఉండేందుకు కొత్తకొత్త కాన్సెప్టులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే హౌస్‌కు ఈసారి కెప్టెన్ ఉండబోరని ప్రకటించారు. కెప్టెన్‌కు బదులుగా చీఫ్స్ (ఒకరు కంటే ఎక్కువమంది లీడర్‌గా) ఉంటారని వెల్లడించారు. అలాగే రేషన్ కూడా వారే సంపాదించుకోవాలన్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రైజ్‌మనీ జీరో అని చెప్పారు. అయితే కంటెస్టెంట్లు ఆడే ఆటను బట్టి ప్రతివారం అది పెరుగుతూ ఉంటుందని తాజా ప్రోమోలో నాగ్ ప్రకటించాడు.

మరో ప్రోమోలో కుక్క, నక్క, గాడిద.. ఇలా మిమ్మల్ని మీరే జంతువులతో పోల్చుకోండి అని టాస్క్ ఇచ్చాడు. ఇంకేముంది, మనవాళ్లు రెచ్చిపోయారు. బాషా.. సీరియస్ టైంలనూ కుళ్లు జోకులు వేసి చిరాకు తెప్పిస్తున్నాడని దోమ బోర్డ్ వేశాడు నిఖిల్. తెలివి తక్కువ గాడిద బోర్డును పృథ్వి.. బేబక్క మెడలో వేశాడు.

నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్తుందే తప్ప తనను తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోలేకపోతోందని పాయింట్ లాగాడు. ఆ మాటతో బేబక్క లేచి.. ఒకరి బలం ఒక్కరోజులోనే తెలిసిపోదు. అలాంటప్పుడు బిగ్‌బాస్ షో వంద రోజులు ఎందుకు? ఒక్కరోజులోనే చేసేయండి అని ఇచ్చిపడేసింది.
vr
Comments
Please login to add a commentAdd a comment