Kantara Movie Expected To Start Streaming Online In November 2022 On Amazon Prime Video - Sakshi
Sakshi News home page

Kantara: బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న ‘కాంతార’ ..ఓటీటీ స్ట్రీమింగ్‌ అందులోనేనా?

Published Wed, Oct 19 2022 12:50 PM | Last Updated on Wed, Oct 19 2022 5:59 PM

Buzz: Is Rishab Shetty Kantara Movie OTT Releasing In Amazon Prime Video, Deets Inside - Sakshi

కన్నడ చిత్రం ‘కాంతార’ గురించి ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం.. భారీ విజయం సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్‌.  తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ‘గీతాఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌’ ద్వారా ఈ నెల 15న విడుదల చేశారు. టాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ‘కాంతార’కు బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా మంచి వసూళ్లను రాబడుతోంది. మౌత్‌ టాక్‌ ద్వారా ఈ సినిమా గురించి తెలుసుకొని ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్తున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో ‘కాంతార’ హవా నడుస్తోంది.

(చదవండి: ఇంకా అరువేనా..‘కాంతార’ కథలు లేవా?)

దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది.  తాజాగా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తోంది. న‌వంబ‌ర్ 4న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మొదటగా కన్నడ వెర్షన్‌ని విడుదల చేసి.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంతో పాటు హిందీ వెర్షన్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement