
సింగర్, నటి దెబత్తమ సాహ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎంతమంది వైద్యుల చుట్టూ తిరిగినా ఇప్పటికీ కోలుకోలేకపోతున్నానంటోంది. గొంతు సమస్య వల్ల పాటలు పాడలేకపోతున్నానని వాపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఈ గొంతు సమస్యతో ఇంకా ఎంతకాలం ఇబ్బందిపడాలో తెలియడం లేదు. ఇప్పటికే నెలన్నర కావస్తోంది.
కోపం వస్తోంది
నా గొంతుతో సరిగా పాడలేకపోతున్నాను. ఇప్పటివరకు నలుగురు డాక్టర్లను కలిశాను కానీ ప్రయోజం లేకుండా పోయింది. చిన్నగా కూనిరాగాలు తీయొస్తుంది.. కానీ హైపిచ్‌లో పాడేందుకు గొంతు సహకరించడం లేదు. నా గొంతు తిరిగొస్తే బాగుండని ప్రతిరోజూ దేవుడిని వేడుకుంటున్నాను. ఒక్కోసారి విపరీతమైన కోపం వస్తోంది. మరోసారి సరిగా పాడలేకపోతున్నానని నా మీద నేనే జోకులు వేసుకుంటున్నాను.
సంతోషమేసినా, బాధనిపించినా..
ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింత ఎక్కువవుతున్నాయి. సంతోషమేసినా, బాధగా అనిపించినా పాటల్నే ఎంచుకునేదాన్ని. ఇప్పుడు పాడటమే కష్టమవుతోంది. ఈ బాధను ఎలా వర్ణించాలో కూడా తెలియడం లేదు. డాక్టర్.. నేను ఎక్కువగా మాట్లాడకూడదని సూచించారు. ఇప్పటికే నా గొంతును ఎక్కువగా ఉపయోగించడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తాయి' అని నటి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment