నాని దసరాతో సూరి కెరీర్‌ టర్న్‌.. ఆ సినిమాలన్నీ తెలుగులో.. | Deekshith Shetty Kannada Movies To Be Dubbed In Telugu | Sakshi
Sakshi News home page

Deekshith Shetty: దసరాలో నాని స్నేహితుడిగా మెప్పించిన సూరి.. ఇప్పుడు బాగా బిజీ!

Published Wed, Nov 15 2023 2:50 PM | Last Updated on Wed, Nov 15 2023 3:00 PM

Deekshith Shetty Kannada Movies To Dubbed in Telugu - Sakshi

దసరా సినిమాలో నాని స్నేహితుడి పాత్రలో నటించిన హీరో దీక్షిత్ శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూరి పాత్రలో తాను చేసిన నటన తెలుగు ప్రేక్షకులను అలరించింది. దీక్షిత్ శెట్టి మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ద్వారా కిలారు ప్రేమ్ చెంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అడ్వెంచర్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది.

ప్రస్తుతం కన్నడలో దీక్షిత్ శెట్టి పలు సినిమాలు చేస్తున్నారు. అందులో 'బ్లింక్', 'కెటిఎమ్' 'కల్యాణ ప్రాప్తిరస్తు' చిత్రాలు ఉన్నాయి. ఇవి తెలుగులో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 'దసరా'తో తెలుగులో దీక్షిత్ శెట్టికి మంచి గుర్తింపు వచ్చింది. అందువల్ల అతడు నటించే కన్నడ సినిమాలు తెలుగులో విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

చదవండి: పాపం.. సెల్ఫీ అడిగినందుకు అభిమానిని కొట్టి మెడ పట్టి తోశారు.. మరీ ఇంత ఘోరమా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement