
అమ్మతనం స్త్రీ జాతికి దక్కిన అపూర్వ గౌరవం. అమ్మ అని పిలిపించుకునేందుకు ప్రతీ మహిళ ఆరాటపడుతుంది. ఆమె సాధారణ మహిళ అయినా, సెలబ్రిటీ అయినా! కాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ కూడా అమ్మ అని పిలిపించుకునే మధుర క్షణాల కోసం ఎదురు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గర్భాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతున్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై మీనా దాస్ నారాయణ్ అనే మహిళా జర్నలిస్టు వ్యంగ్యాస్త్రాలను సంధించారు. (చదవండి: నా జీవితం ఒక్క ఫ్రేములో: విరాట్)
"అనుష్కను విరాట్ కేవలం గర్భవతిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌కు రాణిని చేయలేదు. అంతలా సంబరపడాల్సిన అవసరం లేదు" అంటూ కామెంట్ చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై తెలుగు దర్శకుడు మారుతి సీరియస్‌గా స్పందించారు. "మహిళా జర్నలిస్టు అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవమానకరం. ఓ రాజ్యానికి రాణి అవడం కన్నా బిడ్డకు తల్లిగా మారడమే గొప్ప విషయం. అవును, ప్రతి మహిళ ఒక మహారాణి, సంతోషాలతో తులతూగే ప్రతీ ఇల్లు ఓ రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ అవడం కంటే ముందు ఆమె ఓ సాధారణ మహిళ. తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకుంది" అని కామెంట్ చేశారు. (చదవండి: కంగనా మాజీ ప్రియుడి ఇంటర్వ్యూ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment