డార్లింగ్ ప్రభాస్ నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన పుట్టిన రోజు అభిమానులకు పండగరోజుతో సమానం. దీంతో ఫ్యాన్స్ తాము అరాధించే హీరోకు వీర లెవల్లో బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలతో ట్విటర్‌లో మోత మోగుతోంది. అయితే ప్రభాస్ అభిమానులకు నేడు డబల్ ధమాకా.. ఎందుకంటే ఈ రోజు డార్లింగ్ పుట్టినరోజుతోపాటు ఆయన నటించిన రాధే శ్యామ్ సినిమా నుంచి ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ విడుదల కానుంది. దీని కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. మరి ప్రభాస్ గురించి మీకు ఎంత వరకు తెలుసు.. అతని పూర్తి పేరు, చదివింది ఎక్కడ.. ఇలాంటి ఆసక్తికర విషయాలు మీకు ఎన్ని తెలుసు. ప్రభాస్ గురించి కొన్ని విషయాలు ఇక్కడ చుద్దాం.. చదవండి: ప్రభాస్ ఫోటోతో సిటీ పోలీస్ ట్వీట్..
1.. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు.
2.. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివ కుమారి కొడుకు ప్రభాస్. ఇతను ఇంట్లో చిన్నవాడు. తనకు అన్నయ్య ప్రబోధ్, అక్క ప్రగతి ఉన్నారు.
3.. భీమవరంలోని డీఎన్‌ఆర్ స్కూల్లో చదువుకున్నారు.
4.. ప్రభాస్ ఇంజనీర్ గ్రాడ్యూయేట్( శ్రీ చైతన్య ఇంజరీంగ్ కళశాల).. ముందుగా తను హోటల్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు.. కానీ హీరోగా మారారు.
5... హిందీలో బాహుబలి ప్రభాస్ మొదటి సినిమా కాదు. దీనికంటే ముందు ‘యాక్షన్ జాక్సన్’ అనే సినిమాలో ఆయన అతిథి పాత్ర పోషించారు.
6... బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న మొదటి సౌత్ స్టార్ ప్రభాస్.
7.. కేవలం బాహుబలి సినిమా కోసం నాలుగేళ్లు ఏ సినిమాను ఒప్పుకోలేదు.
8. బాహుబలికి సినిమా కోసం ప్రిపేర్ అవ్వడానికి తన ఇంట్లో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాడు.
9. బాహుబలి కోసం ప్రభాస్ సుమారు 30 కిలోలు బరువు పెరిగాడు.
10.. బాహుబలి కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి వద్ద శిక్షణ తీసుకున్నాడు.
11.. ప్రభాస్‌కు ఇష్టమైన నటుడు రాబర్ట్ డి నిరో.
Comments
Please login to add a commentAdd a comment