
విజయ్ దేవరకొండ, సమంత జంటగా కలిసి చిత్రం 'ఖుషి'. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కశ్మీర్ తొలి షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.
Fact Check: Samantha Vijay Devarakonda Injured In Kushi Shooting Is Fake: విజయ్ దేవరకొండ, సమంత జంటగా కలిసి నటించిన చిత్రం 'ఖుషి'. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కశ్మీర్ తొలి షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో పలు సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా హీరో విజయ్, సమంతకి గాయలయ్యాయని, ఆ వెంటనే వీరిద్దరినీ సమీప ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై మూవీ పీఆర్ టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పేసింది.
'ఖుషి సినిమా షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, సమంతలకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్‌లల్లో వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్‌గా కశ్మీర్‌లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్ననే (మే 23) హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు. అని ఖుషీ పీఆర్ టీమ్ పేర్కొంది. కాగా ‘ఖుషి’ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 23, 2022న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
చదవండి: షూటింగ్‌లో ప్రమాదం.. విజయ్, సామ్‌కి గాయాలు?
Team #Kushi has wrapped up a wondeful first schedule in the exotic and beautiful locales of Kashmir ❤️
— GSK Media (@GskMedia_PR) May 24, 2022
Second schedule begins soon!@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic pic.twitter.com/IZx3lKCRP0