
Fan Letter To Anchor Sree Mukhi: ఓ అభిమాని నుంచి వచ్చిన నాలుగు పేజీల సుదీర్ఘ లేఖను చూసి శ్రీముఖి ఆనందంలో మునిగిపోయింది.
Fan Letter To Anchor Sree Mukhi: యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ రాములమ్మ. తాజాగా ఓ అభిమాని నుంచి వచ్చిన అరుదైన బహుమతిని చూసి మురిసిపోయింది. చదవండి: అలా చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా : నాగబాబు
'ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేసే ఈ రోజుల్లో ఒక లెటర్ పోస్ట్‌లో రావడం, నాలుగు పేజీల్లో నా కెరీర్‌లో జరిగిన అన్ని విషయాలు రాయడం..అది కూడా అచ్చ తెలుగులో. చదువుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీకు మనస్పూర్తిగా థ్యాంక్యూ' అంటూ శ్రీముఖి తనకు వచ్చిన లెటర్‌పై సంతోషం వ్యక్తం చేసింది.
తనకు వచ్చిన లెటర్‌ను సైతం శ్రీముఖి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కాగా బుల్లి తెరపై పలు షోలకు యాంకర్‌గా చేస్తూనే.. అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఆమె ‘క్రేజీ అంకుల్స్’,మాస్ట్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. చదవండి: Posani Krishna Murali: రాళ్లదాడిపై స్పందించిన పోసాని