మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకు ముహుర్తం పెట్టి దాదాపు మూడేళ్లు అవుతుంది. షూటింగ్ మొదలై రెండేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఓ మోషన్ పోస్టర్, పాట మినహా ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్..‘ఒకే ఒక్క అప్‌డేట్’ ఇవ్వండి అంటూ చిత్ర బృందానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక వినాయక చవితి రోజున అప్‌డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించడంతో.. ఏదైనా సర్‌ప్రైజ్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. చెప్పినట్లుగానే ఈ రోజు ఓ అప్‌డేట్ ఇస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.
ఈ సినిమా నుంచి రెండో పాటను ఈ నెలలలోనే విడుదల కాబోతుంది. ఇదే మేకర్స్ ఇచ్చిన తాజా అప్‌డేట్. ఆ పాట ఏ తేదిన రిలీజ్ చేస్తారో కూడా చెప్పలేదు. ఈ విషయాన్ని పక్కకు పెడితే కొత్తగా విడుదల చేసిన పోస్టర్‌లో మాత్రం రామ్ చరణ్ అదిరిపోయాడు. క్లాస్ దుస్తులు , తలకు ఎర్ర తువాల చుట్టి స్టైలీష్‌గా కనిపించాడు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
— Shankar Shanmugham (@shankarshanmugh) September 7, 2024
Comments
Please login to add a commentAdd a comment