తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ నటిస్తున్న 50వ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్). వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చే స్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, కిచ్చా సుదీప్, లైలా, మీనాక్షీ చౌదరి, స్నేహ, యోగిబాబు, జయరాం ఇతర ముఖ్య పాత్రల్లో నటì స్తున్నారు.
ఏజీఎస్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 5న విడుదలకానుంది. ఇదిలా ఉంటే.. జూన్ 22న విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ది గోట్’ నుంచి ఓ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసి, అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇందులో డైలాగ్స్ లేకుండా కేవలం ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పటికీ మంచి స్పందన వస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి ‘చిన్న చిన్న కన్‌గళ్..’(చిన్న చిన్న కళ్లు) అంటూ సాగే రెండో పాటని ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. కుటుంబ భావోద్వేగాలతో సాగే ఈ పాటకి కబిలన్ వైరముత్తు సాహిత్యం అందించారు. యువన్ శంకర్ రాజా, రాజా భవతరినిలతో కలిసి విజయ్ ఈ పాట పాడటం విశేషం. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment