
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పలు డబ్బింగ్ చిత్రాలతో ఎప్పటికప్పుడు అలరిస్తున్న ఇతడు.. ప్రస్తుతం 'ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ద గోట్) పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 5న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం అరుదైన రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైపోయింది.
(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్‌మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)
'ద గోట్' తర్వాత మరో సినిమా మాత్రమే చేయనున్న విజయ్.. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైపోతాడు. చాన్నాళ్ల క్రితమే ఈ విషయం ప్రకటించాడు. ఇకపై పూర్తిగా రాజకీయాలకే అంకితం అవుతునని అన్నాడు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష‍్యంగా విజయ్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే విజయ్ లేటెస్ట్ మూవీ విషయంలో నిర్మాతలు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే 'ద గోట్' చిత్రాన్ని తొలిరోజు తమిళనాడులోని ప్రతిఒక్క థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. ఇప్పుడీ విషయం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. దీన్ని బట్టి మొదటిరోజు వసూళ్లలో విజయ్ రికార్డులు సెట్ చేస్తాడేమో! ఇదిలా ఉండగా ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, పాటలు రేంజ్‌కి తగ్గట్లు లేవు. తెలుగులో అయితే ట్రోలింగ్ నడుస్తోంది. తమిళంలో మాత్రం అరుదైన ఫీట్ సాధించబోతున్నాడు.
(ఇదీ చదవండి: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన లేడీ కమెడియన్)
Comments
Please login to add a commentAdd a comment