కోలీవుడ్ స్టార్ ధనుష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ధనుష్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ వెలుపలికి వచ్చిన ధనుష్‌ను చూసేందుకు, ధనుష్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. అయితే ధనుష్ బాడీ గార్డులు అత్యుత్సాహం చూపడంతో వీడియో చిత్రీకరిస్తున్న మీడియా కెమెరామెన్ కింద పడ్డాడు. దీంతో మీడియా కెమెరామెన్లు ధనుష్ బాడీగార్డులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే రోజు తమిళ సినీ నిర్మాత రామ్ కుమార్ గణేషన్ సైతం స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వాదం తీసుకున్న ఆయన ఆలయం వెలుపలికి వచ్చాక మీడియాతో మాట్లాడారు.
'నడిగర్ తిలగం శివాజీ గణేశన్ 1954లో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 1955లో నేను పుట్టాను. అప్పటి నుంచి మా కుటుంబ సభ్యులమంతా శ్రీవారిని దర్శించుకుంటూ వస్తున్నాం. పుట్టినరోజు వేడుకలు తిరుమలలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. శివాజీ గణేష్ విగ్రహాన్ని మంచి స్థలంలోనే ఏర్పాటు చేశారని.... మెరీనా బీచ్ లో ఏర్పాటుపై సుప్రీం కోర్టు ఆదేశానుసారం ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తిరుమలలో అలాంటి రాజకీయ ప్రస్తావన వద్దు, నడిగర్ తిలగం శివాజీ గణేష్ ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు' అని రామ్ కుమార్ పేర్కొన్నారు.
చదవండి: ఇండస్ట్రీలో అదంతా గ్యాంబ్లింగ్
Comments
Please login to add a commentAdd a comment