కూచిపూడి కళాకారులకు సినీ హీరో కార్తీ సాయం | Hero Karthi Helps Kuchipudi Artists In Hyderabad | Sakshi
Sakshi News home page

కూచిపూడి కళాకారులకు సినీ హీరో కార్తీ సాయం

Jun 12 2021 11:01 AM | Updated on Jun 12 2021 11:01 AM

Hero Karthi Helps Kuchipudi Artists In Hyderabad - Sakshi

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 50 మంది కూచిపూడి కళాకారులకు ఆయన రూ.లక్ష సాయం అందించారు. సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు భావన పెదప్రోలు విజ్ఞప్తి మేరకు కార్తీ ముందుకు వచ్చారు.

బంజారాహిల్స్‌: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కళాకారులకు కష్టకాలం దాపురించింది. ఈ పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న కూచిపూడి కళాకారులను ఆదుకునేందుకు సినీ హీరో కార్తీ ముందుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 50 మంది కూచిపూడి కళాకారులకు ఆయన రూ.లక్ష సాయం అందించారు. సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు భావన పెదప్రోలు విజ్ఞప్తి మేరకు కార్తీ ముందుకు వచ్చారు.

గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల్లోనే సాయం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తన లక్ష్యాన్ని ఈ ఏడాది పూర్తి చేసుకున్నాడు. గుర్తించిన 50 మంది కళాకారులకు ఈ మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేసినట్లు భావన తెలిపారు. ఈ సందర్భంగా కూచిపూడి కళాకారుల తరఫున ఆమె కార్తీకి కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: వ్యాక్సిన్‌ వేయించుకున్న హీరో కార్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement