హిందీ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా టాలీవుడ్‌ నటి | Hindi Bigg Boss OTT Season 3 Winner Sana Makbul | Sakshi
Sakshi News home page

హిందీ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా టాలీవుడ్‌ నటి

Published Sat, Aug 3 2024 10:47 AM | Last Updated on Sat, Aug 3 2024 11:00 AM

Hindi Bigg Boss OTT Season 3 Winner Sana Makbul

హిందీ బిగ్ బాస్ OTT సీజన్ 3 చాలా రసవత్తరంగా పోటీ జరిగింది. అయితే, ఎక్కువ మంది ఊహించినట్లుగానే విజేతగా నటి సనా మక్బుల్‌  నిలిచింది. ర్యాప్‌ సింగర్‌  నేజీ రన్నరప్‌గా నిలిచాడు. ఈ సీజన్ అంతటా సనా చాలా చక్కగా తన ప్రతిభను చూపింది. ఎక్కడా కూడా విమర్శలకు ఛాన్సు ఇవ్వకుండా జాగ్రత్త పడింది. దీంతో ట్రోఫీ ఆమెను వరించింది. జూన్‌ 21న ప్రారంభమైన ఈ సీజన్‌ ఆగస్టు 2న ఫైనల్‌తో ముగిసింది. మొదటి రెండు సీజన్లకు కరణ్‌జోహర్‌, సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌లుగా కొనసాగితే.. మూడో సీజన్‌కు మాత్రం బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ వ్యాఖ్యతగా వ్యవహరించారు.

గ్రాండ్ ఫినాలేలో గెలుపొందిన సనా మక్బుల్  రూ. 25 లక్షల చెక్‌ను అందుకుంది. సనా మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడా విజయం సాధించారు. ముంబైకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో కూడా ఒక సినిమాలో నటించింది. ‘దిక్కులు చూడకు రామయ్య’లో  నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ సీరియల్స్‌లలో కూడా ఆమె రాణిస్తుంది. ఈ సీజన్ మొత్తంలో రణవీర్ షోరే అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్‌ జోడీ తీరు పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. బిగ్‌ బాస్‌లో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఈ సీజన్‌ నిర్వాహుకులపై కేసు కూడా నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement