నా జీవితంలో జరిగినవే సినిమాలో చూపించా: డైరెక్టర్‌ | Ichata Vahanamulu Nilupa Radu Movie All Set To Release | Sakshi
Sakshi News home page

నా జీవితంలో జరిగినవే సినిమాలో చూపించా: డైరెక్టర్‌

Published Mon, Aug 23 2021 7:41 AM | Last Updated on Mon, Aug 23 2021 8:48 AM

Ichata Vahanamulu Nilupa Radu Movie All Set To Release - Sakshi

సుశాంత్, మీనాక్షీ చౌదరి జంటగా ఎస్‌. దర్శన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇచట వాహనములు నిలుపరాదు’. రవిశంకర్‌ శాస్త్రి (దివంగత ప్రముఖ నటి భానుమతి మనవడు), ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రదర్శకుడు ఎస్‌. దర్శన్‌ మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు కేశన్‌ తమిళంలో కొన్ని సినిమాలకు, తెలుగులో ‘యమగోల: మళ్ళీ మొదలైంది’కి దర్శకులు శ్రీనివాస్‌రెడ్డిగారి దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు.

శ్రీనివాస్‌రెడ్డిగారి ‘ఢమరుకం’కు అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశాను. ఇక ‘ఇచట వాహనములు నిలుపరాదు’ విషయానికి వస్తే... పదేళ్ల క్రితం నాకు, నా స్నేహితుడికి జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశా. ఒక రోజులో జరిగే కథ ఇది. నో పార్కింగ్‌ ఏరియాలో బండి పార్క్‌ చేయడం వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నదే కథ. ఓటీటీ ఆఫర్స్‌ వచ్చినప్పటికీ థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు.

చదవండి : బాలకృష్ణ ఆనాడు దారుణంగా అవమానించాడు : కోట
త్రిష ప్రత్యేక పూజలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement