ఈ పాపని గుర్తుపట్టారా? ప్రభాస్ కొత్త సినిమాలో హీరోయిన్ | Imanvi Childhood Pic And Full Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: అనుకోకుండా డ్యాన్సర్.. ఇప్పుడేమో హీరోయిన్

Published Sat, Oct 12 2024 6:12 PM | Last Updated on Sun, Oct 13 2024 9:43 AM

Imanvi Childhood Pic And Full Details

ఎప్పుడు ఎవరికీ ఎలాంటి లక్కీ ఛాన్స్ వస్తుందో తెలియదు. అలా ఈ పాప కూడా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో ఈ వైపు వచ్చింది. సొంతంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉన్న ఈమె.. ఊహించని విధంగా హీరోయిన్ అయిపోయింది. ఏకంగా ప్రభాస్ పక్కన, అది కూడా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు ఇమాన్వి. ప్రభాస్-హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్‍‌గా ఎంపికైంది ఈ అమ్మాయే. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఇమాన్వికి డ్యాన్స్ అంటే మహా పిచ్చి. ఎంబీఏ చేసి జాబ్ కొట్టినా సరే ఎప్పటికప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. కొత్త కొత్త స్టెప్పులు కనిపెట్టేది. ఇదంతా గమనించిన ఈమె తండ్రి యూట్యూబ్ ఛానల్ పెట్టమని ప్రోత్సాహించాడు.

(ఇదీ చదవండి: 'విశ్వంభర' టీజర్‌లో గ్రాఫిక్స్‌పై ట్రోల్స్)

చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన ఇమాన్వి.. పూర్తిస్థాయి డ్యాన్సర్ అయిపోయింది. ఈవెంట్స్, రీల్స్ అని ఫుల్ బిజీ అయిపోయింది. ఇన్‌స్టాలో తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెకు తల్లి నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈమె డ్యాన్స్‌తో పాటు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా ఈమె డ్యాన్స్ వీడియోలు తెలుగు దర్శకుడు హను రాఘవపూడా కంట్లో పడటంతో ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

ఫౌజీ వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. 'సీతారామం'తో మృణాల్‌కి ఎంత పేరు వచ్చిందో.. ఇమాన్వికి అంతకు మించి పేరు రావొచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement