ఆ హీరోతో పని చేయనన్న హీరోయిన్‌.. ఇప్పుడు అతడితోనే హిట్‌.. | Janhvi Kapoor Once Said She Didn't Want To Work With Rajkummar Rao | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ఆ హీరోతో పని చేసేది లేదన్న బ్యూటీ.. కట్‌ చేస్తే..

Published Mon, Jun 3 2024 11:32 AM | Last Updated on Mon, Jun 3 2024 11:45 AM

Janhvi Kapoor Once Said She Didn't Want To Work With Rajkummar Rao

హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రాల్లో రూహి ఒకటి. హారర్‌ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌ కుమార్‌ రావు హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా రిలీజ్‌ సమయంలో 'రాజ్‌కుమార్‌తో పని చేయాలంటే చిరాకుగా ఉంది. ప్రతిసారి ఆయనతో కలిసి ఎలా నటించగలను? కాకపోతే ఆయన చాలా టాలెంట్‌.. నటిగా తన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. తనతో కలిసి పని చేయడం ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న ఫీలింగ్‌ వస్తుంది' అని చెప్పింది.

మరోసారి జోడీ
అతడితో పని చేయడమే చిరాకు అన్న జాన్వీ కపూర్‌.. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి చిత్రంలో మరోసారి రాజ్‌కుమార్‌ రావుతో జోడీ కట్టింది. ఈ సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. తాజాగా ఆమె ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోకు హాజరైంది. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ.. జాన్వీని ఊహించని ప్రశ్న అడిగాడు. రాజ్‌కుమార్‌తో మళ్లీ పని చేయనన్నావ్‌? అని ఇరకాటంలో పడేశాడు.

అందుకే అలా చెప్పా
అందుకు జాన్వీ తెలివిగా సమాధానమిచ్చింది. మీడియా ఎప్పుడూ సెన్సేషనల్‌ హెడ్‌లైన్స్‌ కోసమే ఎదురుచూస్తుంది. నేను అలాంటి స్టేట్‌మెంట్‌ ఇస్తే సినిమా ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందనుకున్నాను. అలాగే తనతో పని చేయడం ఎందుకు కష్టమో కూడా చెప్పాను. తనకు చాలా అనుభవం ఉంది, టాలెంటెడ్‌.. అలాంటి వ్యక్తి పక్కన నటించడం కష్టమే కదా..! అని బదులిచ్చింది.

చదవండి: ప్రముఖ నటుడి బ్యాగ్‌లో 40 బుల్లెట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement