Jr NTR Enjoying Vacation With Family In Singapore - Sakshi

Jr NTR: మాల్‌లో చిల్‌ అవుతున్న తారక్‌, ఎక్కడో తెలుసా?

Published Thu, Jun 2 2022 1:35 PM | Last Updated on Thu, Jun 2 2022 4:46 PM

Jr NTR Enjoys Vacation With Family In Singapore - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజాగా నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎస్‌ఎస్‌ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. రికార్టు స్టాయిలో కలెక్షన్స్‌ రాబట్టి రూ. 1200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆస్వాదిస్తున్నాడు. ఈమూవీ సెక్సెస్‌ జోష్‌లో ఉన్న తారక్‌ ప్రస్తుతం వెకేషన్‌ మూడ్‌లో ఉన్నాడు. తారక్‌ నెక్స్ట్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ 30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రానున్న ఈ సినిమా జూలైలో సెట్స్‌పైకి రానుంది. ఇక ఈ విరామ సమయాన్ని ఎంజాయ్‌ చేసేందుకు తారక్‌ సింగపూర్‌ టూర్‌కు వెళ్లాడు.

సింగ‌పూర్‌లోని ప్ర‌ముఖ టీఎస్ఎంబీఎస్ మాల్‌లో ఎన్టీఆర్‌ అక్కడి ఫ్యాన్స్‌తో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫొటోల్లో ఎక్కడా తారక్‌ భార్య కానీ, పిల్లలు కానీ కనిపించలేదు. చూస్తుంటే తన స్నేహితులతో కలిసి ఎన్టీఆర్‌ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో రాబోతున్న కొర‌టాల సినిమాలో తార‌క్‌ ఈ సారి కొత్త లుక్‌లో అలరించబోతున్నాడని టాలీవుడ్ స‌ర్కిల్‌లో టాక్‌. జ‌న‌తా గ్యారేజీ లాంటి హిట్ సినిమా త‌ర్వాత కొర‌టాల‌-తార‌క్ క్రేజీ కాంబోలో వ‌స్తున్న రెండో సినిమా కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement