Jr NTR Shares His Wedding Moments with Fans in Evaru Meelo Koteeswarulu - Sakshi
Sakshi News home page

Jr NTR-Laxmi Pranathi: లక్ష్మీ ప్రణతిపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Fri, Sep 3 2021 3:05 AM | Last Updated on Fri, Sep 3 2021 11:42 AM

Jr NTR Talks About His Wedding Moments With Lakshmi Pranathi - Sakshi

Jr NTR Comments On Wife Laxmi Pranathi
జూనియర్‌ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌లో తన పెళ్లి నాటి ముచ్చట్లను తన అభిమానులతో పంచుకున్నారు. తాజాగా హాట్ సీటులో కూర్చున్న కంటెస్టెంట్‌తో తన వివాహానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు ఎన్టీఆర్. కంటెస్టెంట్‌ పెళ్లి చూపులు సమయంలో కనీసం మీరు బాగా మాట్లాడారమ్మా కానీ మా పెళ్లి చూపుల్లో అయితే మా ఆవిడ అసలు మాట్లాడలేదు అంటూ సరదాగా నవ్వుకున్నారు. పెళ్లి చూపుల్లో తన భార్యను చూడగానే ఎన్టీఆర్ ఓకే అని చెప్పి వెళ్లిపోయాడట. అయతే లక్ష్మీ ప్రణతి మాత్రం ఎన్టీఆర్‌కు ఎస్ చెప్పలేదు.

అలా అని నో చెప్పలేదు. నేనంటే ఇష్టమేనా లేక బలవంతంగా ఈ పెళ్లిని ఫిక్స్ చేశారా అని ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతిని అడిగారట అయితే దానికి ఆమె అప్పట్లో ఔనని కానీ కాదని కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక పెళ్లికి నిశ్చితార్థానికి మధ్య దాదాపు 8 నెలల గ్యాప్ వచ్చింది. అయితే ఆ సమయంలో కూడా ఆమె ఎన్టీఆర్‌కు ఎస్ అని చెప్పలేదు. ఇక దీనితో ఆడవాళ్లను అర్ధం చేసుకోవడం ఎంత కష్టమో అపుడే తనకు అర్ధమైందన్నారు ఎన్టీఆర్.

ఆడవాళ్లను అర్ధం చేసుకున్నవాడు ప్రపంచంలో దేన్నైనా అర్ధం చేసుకుంటాడనే విషయం తనకు ఆ తర్వాత బోధ పడిందంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహాం జరిగి పది సంవత్సరాలు పూర్తైయింది. వీరికి అభయ్‌రామ్‌, బార్గవ రామ్‌ ఇద్దరు కుమారులు. కాగ ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాకు రాజమౌళి గుమ్మడికాయ కొట్టేశారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement