
అందంతో పాటు అభినయంతో అభిమానులు కొల్లగొట్టిన నటి కాజోల్. 47 వయసులో ఉన్న ఈ నటి ఇప్పటికి కుర్ర హీరోయిన్లకి పోటీ ఇస్తూ బ్యూటీతో..
అందంతో పాటు అభినయంతో అభిమానులు కొల్లగొట్టిన నటి కాజోల్. 47 వయసులో ఉన్న ఈ నటి ఇప్పటికి కుర్ర హీరోయిన్లకి పోటీ ఇస్తూ బ్యూటీతో అదరగొడుతూనే ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో వివాహం తర్వాత సైతం అదపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌కి వచ్చిన ఈమెని వీపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
డ్రెసింగ్, ఎయిర్ స్టైల్ వంటి వాటిలో ఎప్పుడూ ప్రయోగాలు చేసే కాజోల్.. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో బాడీ-కాన్ బ్లాక్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచింది. కానీ ఈ సారి ఆమె చేసిన ప్రయోగం అభిమానులకు నచ్చలేదు. దీంతో విపరీతంగా ట్రోల్ చేశారు. ‘ఆమె నా బైక్ కవర్ వేసుకొచ్చింది’ అని ఒకరు అనగా.. ‘అది బ్లాంకెట్‌లా ఉంది.. అవార్డు రాకపోతే అది కప్పుకొని పడుకోవచ్చు’ అంటూ కామెంట్ చేశారు. ఒకరైతే కాజోల్ అవుట్ ఫిట్ ఫ్యాషన్ డిజాస్టర్ అంటూ ట్రోల్ చేశాడు.
చదవండి: ‘డీడీఎల్‌జే’ విడుదలై 26 ఏళ్లు.. థ్యాంక్స్ చెప్పిన కాజోల్