Kangana Ranaut Dhaakad Movie Gets An OTT Release, Check Date And Other Details - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: ఓటీటీలో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా ధాకడ్‌ మూవీ

Published Mon, Jun 20 2022 9:31 PM | Last Updated on Tue, Jun 21 2022 9:22 AM

Kangana Ranaut Dhaakad Movie OTT Release Date Out Now - Sakshi

బాలీవుడ్‌ కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ధాకడ్‌. మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డులు తిరగరాస్తుందనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా చతికిలపడింది. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ రూ. 80- 85 కోట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ప్రేక్షకులు దారుణంగా తిరస్కరించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. జీ5లో జూలై 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. రజనీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అర్జుణ్‌ రాంపాల్‌, దివ్య దత్త, సస్వత చటర్జీ ముఖ్యపాత్రలు పోషించారు.

చదవండి: షూలు వేసుకుని ఆలయంలోకి హీరో? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌
జూన్‌ నాలుగో వారంలో విడుదలవుతున్న సినిమాల లిస్ట్‌ ఇదిగో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement