Kantara Movie Breaks KGF2 Record Viewership In Karnataka Hombale Films - Sakshi
Sakshi News home page

Kantara Movie: కర్ణాటకలో కాంతార రికార్డ్.. ఆ విషయంలో కేజీఎఫ్‌-2ను దాటేసింది

Published Tue, Oct 25 2022 9:00 PM | Last Updated on Wed, Oct 26 2022 7:40 AM

Kantara Breaks KGF2 Record Viewership In Karnataka Hombale Films - Sakshi

కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతోంది. దేశవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే సంస్థ నిర్మించింది.  అయితే తాజాగా ఈ చిత్రం కర్ణాటకలో హోంబలే సంస్థ నిర్మించిన సినిమాల్లో అత్యధికంగా వీక్షించిన మూవీగా నిలిచింది. 

(చదవండి: ‘కాంతార’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?)

ఈ విషయంలో యశ్ మూవీ కేజీఎఫ్-2 రికార్డును అధిగమించింది. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం మున్ముందు మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే.  ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ బ్లాక్‌బస్టర్ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. 
 
చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ‘గీతాఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌’ ద్వారా ఈ నెల 15న విడుదల చేశారు. టాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ‘కాంతార’కు బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా మంచి వసూళ్లను రాబడుతోంది. మౌత్‌ టాక్‌ ద్వారా ఈ సినిమా గురించి తెలుసుకొని ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్తున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో ‘కాంతార’ హవా నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement