
ముందుగానే రిహార్సల్స్ చేసి షూటింగ్‌కు వెళ్లినట్లు తెలిపారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని సమస్యల్లో ఇరుక్కోకూడదు అని చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు.
దర్శకుడు, నిర్మాత కథానాయకులుగా నటించిన చిత్రం ఎనక్కు ఎండే కిడైయాదు. హంగ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్పి పతాకంపై కార్తీక్ వెంకట్రామన్ నిర్మించి హీరోగా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా విక్రమ్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతూ మరో హీరోగా నటించారు. నటి స్వయంశిత కథానాయికగా నటించిన ఇందులో శివకుమార్‌రాజు, పిచ్చైక్కారన్ చిత్రం ఫేమ్ మురళి శ్రీనివాసనన్, శక్తివేల్ ముఖ్యపాత్రలు పోషించారు.
దళపతి రత్నం చాయాగ్రహణం, కళా చరణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రం నిర్మాత, కథానాయకుడు కార్తీక్ వెంకట్రామన్ చిత్ర వివరాలను తెలుపుతూ చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను 35 రోజుల్లో పూర్తిచేసినట్లు చెప్పారు. ముందుగానే రిహార్సల్స్ చేసి షూటింగ్‌కు వెళ్లినట్లు తెలిపారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని సమస్యల్లో ఇరుక్కోకూడదు అని చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు.
రెండు, మూడు చిత్రాల్లో నటించిన హీరోలు తమ చిత్రంలో నటించడానికి నిరాకరించడంతో తామే హీరోలుగా నటించినట్లు తెలిపారు. ఇది హిందీ చిత్రం హ్యాంగోవర్ తరహాలో ఉంటుందన్నారు. చిత్రం చూడడానికి థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులను ఐదు నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేస్తుందన్నారు. చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులు చాలా ఫ్రెష్‌గా ఉందని ప్రశంసించారని చెప్పారు. చిత్ర విడుదల హక్కులను యాక్షన్ రియాక్షన్ సంస్థ అధినేత జెనీష్ పొందారని, త్వరలోనే దీన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
చదవండి: గర్భం దాల్చాను.. అమ్మ అబార్షన్ చేయించింది.. ప్రియుడితో ఇప్పటికీ టచ్‌లో..