కోమాలోకి వెళ్లినప్పుడు చివరిసారి చూశా.. చిన్న వయసులో.. | Keerthy Suresh Shares Emotional Post About Her Childhood Friend Demise, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: తననలా చూడలేకపోయా.. హాస్పిటల్‌లో ఏడ్చేశా.. ఎంతో పోరాడింది.. చివరికి!

Published Sat, Aug 3 2024 6:46 PM | Last Updated on Sat, Aug 3 2024 8:04 PM

Keerthy Suresh Shares Emotional Post About Her Childhood Friend Demise

హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ స్నేహితురాలిని కోల్పోయిన దుఃఖంలో ఉంది. తన చిన్ననాటి స్నేహితురాలు మనీష మరణించి వారాలు గడుస్తున్నా ఆ విషాదం నుంచి బయటపడలేకపోతోంది. తాజాగా ఆమెను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. 'గడిచిన రోజులు ఎంతో కష్టతరమైనవి. నా చిన్ననాటి ఫ్రెండ్‌ మమ్మల్ని ఇంత త్వరగా వదిలేసి వెళ్లిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. 21 ఏళ్ల వయసులోనే తనకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి సోకింది. 

మూడో సర్జరీ..
దాదాపు ఎనిమిదేళ్లపాటు పోరాడింది. తనలా ధైర్యంగా పోరాడేవారిని నేను చూడనేలేదు. గతేడాది నవంబర్‌లో మూడోసారి సర్జరీ చేయించుకుంది. ఆ తర్వాత ఈ నొప్పి భరించలేకపోతున్నానంటూ నా ముందు ఏడ్చేసింది. అదే తనతో నాకున్న చివరి జ్ఞాపకం. తనముందు నా ఎమోషన్స్‌ను ఆపుకునే ప్రయత్నం చేశాను. కానీ నా వల్ల కాలేదు. బయటకు వచ్చి ఏడ్చేశాను. 

కోమాలోకి వెళ్లినప్పుడు చివరిసారి
హాస్పిటల్‌ కారిడార్‌లో కళ్లజోడు, మాస్క్‌ల వెనక ఉన్న కన్నీళ్లను ఎవరికీ కనిపించకుండా తుడిచేసుకున్నాను. తను కోమాలోకి వెళ్లినప్పుడు చివరిసారి చూశాను. ఆమె ఇంకా సొంతంగా జీవితాన్ని ప్రారంభించలేదు, ప్రపంచాన్ని చూడనేలేదు, నెరవేర్చుకునే కలలు ఎన్నో ఇంకా అలాగే మిగిలున్నాయి.. ఇంత చిన్న వయసులోనే తనకు ఎందుకిలా జరిగింది? దీనికి నా దగ్గర సమాధానమే లేదు. వ్యాది తీవ్రం కావడంతో ఆమె చనిపోయింది. కానీ చివరి శ్వాస వరకు పోరాడింది.

వదిలి వెళ్లిపోయావ్‌..
సరిగ్గా నెల రోజుల క్రితం నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు. అప్పటినుంచి నీ గురించి ఆలోచించని రోజంటూ లేదు. ఈ రోజు నీ పుట్టినరోజు.. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను మచ్చుత' అని రాసుకొచ్చింది. తన స్నేహితురాలితో దిగిన ఫోటోలను ఈ పోస్టుకు జత చేసింది.

 

 

చదవండి: ఆ సినిమాలు డేంజర్‌, అలాంటివాటి జోలికి వెళ్లడం అవసరమా?: ఆర్జీవీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement