స్కిట్లతో కడుపుబ్బా నవ్వించే కిర్రాక్ ఆర్పీ గత కొంతకాలంగా కామెడీ షోలు చేయడమే మానేశాడు. తనకంటూ సొంతంగా బిజినెస్ పెట్టాలనుకున్న ఆయన గత నెలలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట హైదరాబాద్‌లో ఓ కర్రీ పాయింట్ ప్రారంభించాడు. ఈ బిజినెస్ ఊహించినదానికన్నా ఎక్కువ స్థాయిలో హిట్ అయింది. కర్రీ పాయింట్‌కు పెద్ద సంఖ్యలో జనాలు పోటెత్తారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతుండటంతో తాత్కాలికంగా కర్రీపాయింట్‌ను క్లోజ్ చేశాడు ఆర్పీ. డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై ఉండాలన్న ఆలోచనతో నెల్లూరు వెళ్లి అక్కడ చేపల పులుసు పోటీ పెట్టాడు.
బాగా రుచికరంగా వండిన కొందరు మహిళలను హైదారాబాద్‌కు తీసుకొచ్చి తిరిగి కర్రీపాయింట్ ప్రారంభించాడు. డప్పుచప్పుళ్ల మధ్య కేక్ కట్ చేసి షాప్‌ను తిరిగి ఓపెన్ చేశాడు. నెల్లూరు నుంచి తీసుకొచ్చిన మహిళలకు ప్రస్తుతానికి తన ఇంట్లోనే ఆతిథ్యమిచ్చాడు ఆర్పీ. మహిళలందరూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి వంట మొదలుపెడతారని నాలుగు గంటల్లో వంట పూర్తవుతుందని చెప్పుకొచ్చాడు. తమ కర్రీ పాయింట్‌కు ఇప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు ఆర్పీ.
Comments
Please login to add a commentAdd a comment