
రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఇదే చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది రహస్య గోరఖ్. జంటగా ఆన్‌స్క్రీన్‌లో రొమాన్స్ చేసిన వీళ్లిద్దరూ ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేమించుకుంటున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. మొదట్లో స్నేహితులుగా ఉన్నప్పటికీ రానురానూ అది ప్రేమగా ముదిరిందని టాక్ నడిచింది. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తూ ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లేవారు.
ప్రేమకు రెడీ
దీన్ని గుట్టుచప్పుగా ఉంచేందుకే ప్రయత్నించేవారు. కానీ ఇద్దరూ షేర్ చేసిన ఫోటోల బ్యాగ్రౌండ్‌లో లొకేషన్ ఒకటే ఉండటంతో ఈ ప్రేమపక్షులు కలిసే వెళ్లారని అభిమానులు ఇట్టే పసిగట్టేవారు. ఇలా ఏళ్లుగా చాటుగా ప్రేమించుకుంటున్న వీరు తమ ప్రేమను అఫీషియల్‌గా ప్రకటించనున్నారట. అది కూడా పెళ్లి బంధంతో!
ఐదేళ్లుగా లవ్..
రహస్యను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడట కిరణ్ అబ్బవరం! బుధవారం (మార్చి 13) నాడు వీరి ఎంగేజ్‌మెంట్ జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి బంధంతో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లనుండటంతో అభిమానులు ఈ లవ్ బర్డ్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
చదవండి: నా షోలోకి ఉపాసన, సురేఖలను తీసుకొస్తా.. వారితో వంట చేయిస్తా..
Comments
Please login to add a commentAdd a comment