కోలీవుడ్‌లో తనకంటూ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్న అతి కొద్ది మంది కథానాయకల్లో నటి పార్వతి ఒకరు. విక్రమ్ తంగలాన్ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో ఈ బ్యూటీ నటించింది. పూ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ బ్యూటీ అక్కడ సత్తా చాటుతుంది. కమలహాసన్ కథానాయకుడిగా నటించిన ఉత్తమ విలన్, ధనుష్ హీరోగా నటించిన మరియాన్, చెన్నైయిల్ ఒరు నాళ్ వంటి పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఈమె తన పేరుకు ముందు ఇంటి పేరును పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు.
ఇకపోతే మాతృభాషలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న పార్వతి అప్పుడప్పుడూ కోలీవుడ్‌లో నటిస్తుంటారు. అలా ఈమె తాజాగా నటించిన తమిళ చిత్రం తంగలాన్. విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 15వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా నటి పార్వతి ఓ భేటీలో పేర్కొంటూ తంగలాన్ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించానని చెప్పారు. ఇకపోతే పూ చిత్రంలో నటించినప్పుడు తనకు తమిళ భాష సరిగా తెలియదన్నారు. అయినప్పటికీ తన పాత్రకు సంబంధించిన సంభాషణలను ఇతరులతో చదివించుకుని వినేదాన్నని చెప్పారు.
తమిళంలో ఎక్కువగా నటించడం లేదేంటనీ అడుగుతున్నారని, మంచి అవకాశాలు అయితేనే నటించడానికి సమ్మతిస్తున్నానని చెప్పారు. తనకు అవకాశాలు తగ్గితే టీకొట్టు పెట్టుకుంటానని చెప్పారు. నటిని కాకముందే తనకు వ్యాపారంపై ఆసక్తి అని చెప్పారు. ముఖ్యంగా టీకొట్టు పెట్టుకోవాలని ఆశపడ్డానని చెప్పారు. ఏ వృత్తి చేసినా అందులో మర్యాద ముఖ్యం అని అది లేకుంటే సినిమా నుంచే వైదొలుగుతానని నటి పార్వతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment