ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలతో పాటు వెంటాడే పీడకలలూ ఉంటాయి. అందుకు సెలబ్రిటీలు అతీతం కాదు. వెండితెరపై మేకప్ వేసుకుని నవ్వుతూ కనిపించినా దాని వెనక ఎంతో విషాదాన్ని గొంతులోనే ఆపేస్తుంటారు. నటి కుబ్ర సైత్ కూడా ఎన్నో ఏళ్లుగా భరిస్తున్న బాధను ఎట్టకేలకు బయటపెట్టి కొంత భారాన్ని తగ్గించుకుంది. నోటితో కాకపోయినా తను రాసిన ఓపెన్ బుక్: నాట్ క్వైట్ ఎ మెమోయిర్ అనే పుస్తకంలో ఎంతోకాలంగా అనుభవిస్తున్న వేదనను బయటపెట్టింది.
'అప్పుడు నాకు 17 ఏళ్లు. మా ఫ్యామిలీ అంతా కలిసి బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌కు తరచూ వెళ్తూ ఉండే వాళ్లం. అలా ఆ రెస్టారెంట్ యజమాని మా కుటుంబానికి దగ్గరయ్యాడు. మా అమ్మకు ఆర్థికంగా సాయం కూడా చేశాడు. ఆ తర్వాతే అతడిలోని అసలు రూపాన్ని బయటపెట్టాడు. కారులో కూర్చొన్నప్పుడు నా తొడ మీద చేయి వేసి నిమిరుతూ, అసభ్యంగా తాకుతూ వేధించడం మొదలుపెట్టాడు. నేను అంకుల్ అని పిలిస్తే కూడా అలా పిలవొద్దని వారించాడు.
తరచూ మా ఇంటికి రావడం కూడా మొదలుపెట్టాడు. అమ్మ అతడికి వంట చేసి పెట్టేది, నవ్వుతూ మాట్లాడేది. ఆమె ముందే అతడు నా బుగ్గ మీద ముద్దు పెడుతూ నువ్వు నాకెంతో ఇష్టం తెలుసా? అని కబుర్లు చెప్పేవాడు. నాకు అసౌకర్యంగా అనిపించినా ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉండిపోయేదాన్ని. ఓసారి నన్ను హోటల్‌కు తీసుకెళ్లి నా పెదాలపై ముద్దు పెట్టాడు. అతడు చేసిన పనికి షాకయ్యాను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ క్షణం గట్టిగా అరవాల్సింది, సాయం కోసం పరిగెత్తాల్సింది. కానీ షాక్‌లో ఉండిపోవడంతో నా నోటి నుంచి చిన్న మాట కూడా పెగల్లేదు. అతడు అలానే నాకు ముద్దులు పెడుతూనే తనకు నచ్చింది చేసుకుంటూ పోయాడు. నా వర్జినిటీ కోల్పోయాను. ఇదే నా జీవితంలో అత్యంత సిగ్గుచేటు రహస్యం.
రెండున్నరేళ్లపాటు అతడు లైంగికంగా వేధించాడు. అతడు డబ్బులు పంపించడం ఆపివేసినప్పుడు ఎందుకు అతడితో గొడవపడుతున్నావని అమ్మ నన్నే తిట్టేది. నేను అతడికి అడ్డు చెప్తే నా కుటుంబంతో మాట్లాడటమే కాదు, సాయం చేయడం కూడా మానేస్తాడు. పైగా ఈ విషయం మా ఇంట్లో చెప్తే మా కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. అందుకే నా బాధను, అనుభవించిన క్షోభను ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఆ సమయంలో నేను జీవచ్చవంలా బతికాను' అని చెప్పుకొచ్చింది. కాగా కుబ్ర నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సాక్రెడ్ గేమ్స్‌లో నటించింది.
చదవండి: ఛీ, దరిద్రమంటూ నెటిజన్ ఓవరాక్షన్, కౌంటరిచ్చిన రానా
వర్జినా? అన్న ప్రశ్నకు సుశాంత్ ఏమని ఆన్సరిచ్చాడంటే?
Comments
Please login to add a commentAdd a comment