
కొత్త సినిమా రిలీజవుతుందంటే చాలు, థియేటర్ల దగ్గర బోలెడంత హడావుడి ఉండేది. కానీ కరోనా కారణంగా షూటింగులకు, మూవీస్ రిలీజ్‌కు బ్రేక్ పడటంతోపాటు థియేటర్లు కూడా మూతపడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటంతో థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో థియేటర్లలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. మరికొన్ని మాత్రం అప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో డీల్ కుదుర్చుకోవడంతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు సై అంటున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్‌లో ఇటు ఓటీటీలో సందడి చేసే చిత్రాలేంటో చూసేద్దాం..
ఇష్క్
జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జ నటిస్తున్న చిత్రం ఇష్క్: నాట్ ఎ లవ్ స్టోరీ. ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఇటీవలే కరాఖండిగా చెప్పేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఎస్ రాజు దర్శకత్వంలో ఆర్‌బీ చౌదరి సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.
తిమ్మరుసు
శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అలాంటి తెలివితేటలున్న లాయర్ పాత్రలో సత్యదేవ్ నటించిన చిత్రం తిమ్మరుసు. ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
వీటితో పాటు రిలీజ్ కానున్న మరిన్ని చిత్రాలు...
మిమి: నెట్‌ఫ్లిక్స్, జూలై 26
లవ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కరోనా(లఘు చిత్రం): వూట్ సెలక్ట్, జూలై 27
లైన్స్ (లఘు చిత్రం): వూట్ సెలక్ట్, జూలై 29
ఛత్రసల్(వెబ్ సిరీస్): ఎమ్‌ఎక్స్ ప్లేయర్, జూలై 29
వన్: ఆహా, జూలై 30
సిటీ ఆఫ్ డ్రీమ్స్ రెండో సీజన్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జూలై 30
లిహాఫ్(లఘు చిత్రం): వూట్ సెలక్ట్, జూలై 31
Comments
Please login to add a commentAdd a comment