హీరోయిన్ మడోన్నా కూడా మారిపోయింది! | Madonna Sebastian Latest Glamorous Pics And Movies | Sakshi
Sakshi News home page

Madonna Sebastian: గ్లామర్ విషయంలో అస్సలు తగ్గట్లేదుగా

Published Tue, May 28 2024 8:47 AM | Last Updated on Tue, May 28 2024 9:06 AM

Madonna Sebastian Latest Glamourous Pics And Movies

సినిమాకు గ్లామర్ ముఖ్యమే. కానీ ఇప్పుడు హీరోయిన్లకు కూడా గ్లామరే ప్రధానంగా మారిపోతోంది. ఇంతకు ముందు పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్న చాలామంది బ్యూటీస్.. ఇప్పుడు గ్లామర్ పాత్రలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు మడోన్నా సెబాస్టియన్ కూడా చేరినట్లు అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

పలుమార్లు స్టేజీపై పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న మడోన్నా.. 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేసింది. కానీ ఎందుకనో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. గతేడాది వచ్చిన విజయ్ 'లియో'లో అతడికి చెల్లెలిగా చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

అయితే ఇప్పటివరకూ గ్లామర్‌కి దూరంగా ఉంటూ వచ్చిన మడోన్నా.. ఇప్పుడు మాత్రం రూట్ మార్చేసినట్లు అనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా గ్లామర్ చూపిస్తూ రెచ్చిపోతోంది. అయితే దర్శకనిర్మాతలకు తాను కూడా గ్లామర్ బ్యూటీనే అనే హింట్ ఇస్తోందా అని సందేహం వస్తుంది. ఇలా అయినా సరే ఈమెకు కమర్షియల్ మూవీస్‌లో ఛాన్సులొస్తాయేమో చూడాలి?

(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement